OG Movie: ప్లాప్ సినిమాలను గుర్తుచేస్తున్న సువ్వి సువ్వి పోస్టర్

ABN , Publish Date - Aug 24 , 2025 | 05:58 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం OG. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

OG Movie

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం OG. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 25 న OG రిలీజ్ కు రెడీ అవుతోంది.


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుసగా లిరికల్ వీడియోలను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. తాజాగా OG నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. వినాయక చవితి సందర్భంగా సువ్వి సువ్వి అనే ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు కొత్త పోస్టర్ ద్వారా తెలిపారు. ఆగస్టు 27 న ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. పోస్టర్ లో పండగ వాతావరణం కనిపించింది. ప్రియాంక మోహన్ తో కలిసి పవన్ కోనేటిలో దీపాలు వదులుతూ కనిపించాడు. ఈ పోస్టర్ చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంది.


ఇక ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్ కాపీ కొట్టారని చెప్పుకొస్తున్నారు. పవన్ పాత ప్లాప్ సినిమాల్లోని సాంగ్స్ లానే ఈ సాంగ్ కూడా ఉండబోతుందని జోస్యం చెప్పుకొస్తున్నారు. పవన్ నటించిన తీన్ మార్, కాటమ రాయుడు సినిమాల్లో ఇలానే కోనేటి దగ్గర ఒక సాంగ్ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలు పరాజయాన్ని అందుకున్నాయి. తీన్ మార్ లో శ్రీ గంగా సాంగ్ మాత్రం ఇప్పటికీ చార్ట్ బస్టర్ గానే కొనసాగుతుంది. అందులో కూడా పవన్, హీరోయిన్ తో కోనేటి వద్ద దీపాల మధ్య కనిపిస్తాడు.


ఇప్పుడు ఆ సాంగ్ స్క్రీన్ షాట్స్ తీసి.. సువ్వి సువ్వి సాంగ్ కూడా సేమ్ అని ట్రోల్ చేస్తున్నారు. కొందరు ఆ సాంగ్స్ కు కాపీ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి తరువాత వచ్చే సాంగ్ అని అంటున్నారు. గంభీరగా పవన్ కనిపిస్తుండగా.. కణ్మయిగా ప్రియాంక నటిస్తోంది. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. మరి ఈ సాంగ్ తో థమన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

GAMA: ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా గామా అవార్డ్స్  

Mini Mathur: కాజోల్ పై బాడీ షేమింగ్.. మీకెంత ధైర్యం అన్న హీరోయిన్

Updated Date - Aug 24 , 2025 | 05:58 PM