Mini Mathur: కాజోల్ పై బాడీ షేమింగ్.. మీకెంత ధైర్యం అన్న హీరోయిన్
ABN , Publish Date - Aug 24 , 2025 | 04:45 PM
ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు బాడీ షేమింగ్ తప్పదు. ఎంతోమంది హీరోయిన్స్ ఈ బాడీ షేమింగ్ కు గురయ్యారు.
Mini Mathur: ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు బాడీ షేమింగ్ తప్పదు. ఎంతోమంది హీరోయిన్స్ ఈ బాడీ షేమింగ్ కు గురయ్యారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో అందరూ హీరోయిన్లు ఎదుర్కొంటున్న సమస్య బాడీ షేమింగ్. ఎలాంటి దుస్తులు ధరించినా.. కొంతమంది ట్రోలర్స్ జూమ్ చేసి మరీ వారిని చూస్తూ అక్కడ అలా ఉంది.. ఇక్కడ ఇది కనిపిస్తుంది అని ట్రోల్ చేయడం ఫ్యాషన్ గా మారింది. కొంతమంది వీటిని తేలికగా తీసుకున్నా.. కొంతమంది హీరోయిన్స్ మాత్రం బాడీ షేమింగ్ పై ఫైర్ అవుతున్నారు.
తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ కాజోల్ దేవగణ్ బాడీ షేమింగ్ కు గురైంది. తాజాగా ఆమె నటించిన ది ట్రయిల్ వెబ్ సిరీస్ సీజన్ 2 రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో సిరీస్ లో నటించేవారు అందరూ పాల్గొన్నారు. కాజోల్ బ్లాక్ బాడీకాన్ డ్రెస్ తో మెస్మరైజ్ చేసింది. అయితే కొంతమంది మాత్రం ఆమె డ్రెస్సింగ్ పై విమర్శలు గుప్పించారు. టైట్ డ్రెస్ కావడంతో పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపించింది. అంతేకాకుండా బ్యాక్ కూడా మడతలు కనిపించాయి. ఇక దీంతో కాజోల్ ప్రెగ్నెంటా ఏంటి అని కొందరు.. ఆమె మడతలు చూసారా.. ? అలాంటి డ్రెస్ లు ఎందుకు వేసుకోవడం అంటూ ట్రోల్స్ చేశారు.
కాజోల్ పై బాడీ షేమింగ్ పై ఆమె ఏమి స్పందించలేదు కానీ, మరో నటి మినీ మాథుర్ ఫైర్ అయ్యింది. కాజోల్ బాడీ షేమింగ్ వీడియో కింద కామెంట్స్ లో ఆమె మండిపడింది. మీకెంత దైర్యం ఉంటే అలా జూమ్ చేసి చూస్తారు అంటూ ట్రోలర్స్ పై విరుచుకుపడింది. ' మీకెంత ధైర్యం ఉంటే ఆమె బాడీని జూమ్ చేసి చూస్తారు. ఆమె మీకెప్పుడు యవ్వనంగా కనిపించదు. ఆమె దుస్తులు ఎలా వేసుకోవాలో ఆమెకు తెలుసు. మీరెవరూ డిసైడ్ చేయడానికి' అంటూ మండిపడింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
OG నుంచి క్రేజీ అప్డేట్.. సువ్వి సువ్వి వచ్చేస్తోంది
NBK: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో స్థానం