GAMA: ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా గామా అవార్డ్స్  

ABN , Publish Date - Aug 24 , 2025 | 05:27 PM

ప్రతిష్టాత్మమైన అవార్డ్స్ కు టాలీవుడ్‌లో  స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు   వైభవంగా జరిగాయి. ఇప్పుడు 5వ ఎడిషన్ వేడుకలు  ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో గ్రాండ్‌గా జరగనుంది.

ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌లో  స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు   వైభవంగా జరిగాయి. ఇప్పుడు 5వ ఎడిషన్ వేడుకలు  ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో గ్రాండ్‌గా జరగనుంది.  ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గామా సీఈవో సౌరబ్ కేసరి, వైభవ్ జ్యువెలర్స్ ఎండి రాఘవ్, జ్యూరీ సభ్యులు,   దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి గారు, బి గోపాల్ గారు, హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.

గామా సీఈవో సౌరబ్ కేసరి మాట్లాడుతూ 'ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈవెంట్ కాదు. మా నాన్న (త్రిమూర్తులు) గారికి కళాకారులపై ఉన్న అభిమానం తో గామా అవార్డ్స్  నిర్వహిస్తున్నాం. అందరి సపోర్ట్ తో ముందుకు వెళ్తున్నాం. వచ్చే ఏడాది మరింత గ్రాండ్ గా అవార్డ్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఇతర దేశాల్లోను గామా అవార్డ్స్ ఇచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం.  దుబాయ్ లో ఉన్న తెలుగు వారితోపాటు ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈవెంట్ ను నిర్వహించబోతున్నాం. మా జ్యూరీ సభ్యుల సహకారంతో అవార్డు విజేతలను ఎంపిక చేశాం' అని అన్నారు.

జ్యూరీ సభ్యులు, కోదండ రామిరెడ్డి గారు మాట్లాడుతూ 'ఈ అవార్డ్స్ లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను, బి గోపాల్, కోటి సహా పలువురు ప్రముఖులు కూడా జ్యురీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి అవార్డ్స్ నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి. ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేసేలా ఉంటాయి. ఆగస్టు 30న దుబాయ్ లో జరగనున్న ఈ గామా అవార్డ్స్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.." గతేడాది జరిగిన ఫోర్త్ ఎడిషన్ గామా అవార్డ్స్ లో  స్పెషల్ పెర్ఫార్మన్స్ చేశాను  ఈసారి కూడా స్పెషల్ పెర్ఫార్మన్స్ తో అలరించబోతున్నా' అని చెప్పారు.  మొదటిసారి గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫార్మన్స్ చేయబోతున్నామని హీరోయిన్ మానస వారణాసి దక్షా నాగర్కర్ అన్నారు. ఆగస్టు 30న  టాలీవుడ్ అవార్డ్స్ తో పాటు ఆగస్టు 29న  ఎక్సలెన్స్  అవార్డ్స్  వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.


ప్రత్యేక అతిధులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్,   వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్ ప్రైజ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారు. 

   

Updated Date - Aug 24 , 2025 | 05:27 PM