సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suriya: ఆమె మనస్సు చిన్న పిల్లలాంటిది.. సరోజాదేవి మృతిపై సూర్య ఎమోషనల్

ABN, Publish Date - Jul 14 , 2025 | 08:10 PM

నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకున్న విషయం విదితమే. అలనాటి మేటి నటి బి. సరోజాదేవి (B. Sarojadevi)కన్నుమూశారు.

Suriya

Suriya: నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకున్న విషయం విదితమే. అలనాటి మేటి నటి బి. సరోజాదేవి (B. Sarojadevi)కన్నుమూశారు. వయో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు బి. సరోజా దేవి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కోట శ్రీనివాసరావు.. నేడు సరోజా దేవి మరణాలతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. దిగ్గజ నటులను కోల్పోవడం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పరిశ్రమ పెద్దలు చెప్పుకొస్తున్నారు.


ఇక బి. సరోజాదేవితో కలిసి పనిచేసిన పలువురు ప్రముఖులు ఆమెతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు సూర్య.. సరోజాదేవి మృతిపై ఎంతో ఎమోషనలయ్యాడు. ట్విట్టర్ లో సరోజాదేవితో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించినందుకు తానెంతో అదృష్టవంతుడనని, ఆమె తనపై, తన కుటుంబంపై ఎంతో ప్రేమను చూపించిందని చెప్పుకొచ్చాడు. 'సరోజా దేవి అమ్మ మరణం బాధాకరం. ఆమె ఎప్పుడూ నాపై, నా కుటుంబంపై ఎంతో ప్రేమను కురిపించింది... ఆమె మనసు చిన్నపిల్లలాంటిది .. ఆధవన్ కోసం ఆమెతో కలిసి పనిచేసిన మధురమైన జ్ఞాపకాలు మాకు ఉన్నాయి. వాటిని మరచిపోలేము. ఆమె వారసత్వం & హోదా పట్ల నాకు చాలా గౌరవం ఉంది' అని రాసుకొచ్చాడు.


సరోజా దేవి తెలుగులోనే కాదు అన్ని భాషల్లో నటించింది. ముఖ్యంగా రీఎంట్రీలో కూడా ఎన్నో మంచి సినిమాలు చేసింది. అందులో ఒకటి ఆధవన్. తెలుగులో ఘటికుడు పేరుతో రిలీజ్ అయ్యింది. సూర్య, నయనతార జంటగా నటించిన ఈ సినిమాకు కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా.. నటుడు ఉదయనిధి స్టాలిన్ నిర్మించాడు. ఈ చిత్రం 2009 లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సూర్య బామ్మగా సరోజాదేవి నటించింది. నయన్ కు ధీటుగా ఎంతో స్టైల్ గా ఆమె కనిపించింది. ఇప్పటికీ ఆమె కెరీర్ లో ఘటికుడు ఒక మంచి చిత్రంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సూర్య పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Sreeleela: జూనియర్ కి రూ. 4 కోట్లా.. మామూలుగా లేదుగా

Updated Date - Jul 14 , 2025 | 08:11 PM