Sreeleela: జూనియర్ కి రూ. 4 కోట్లా.. మామూలుగా లేదుగా
ABN , Publish Date - Jul 14 , 2025 | 07:33 PM
అందాల భామ శ్రీలీల (Sreeleela) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే కుర్ర కారుకు తెగ నచ్చేసింది.
Sreeleela: అందాల భామ శ్రీలీల (Sreeleela) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే కుర్ర కారుకు తెగ నచ్చేసింది. ఇక ఈ సినిమా విజయం అందుకోలేకపోయినా కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. విజయపజయాలను పక్కనపెడితే శ్రీలీల చేతిలో ఇప్పటికీ అరడజన్ సినిమాలు ఉన్నాయి
ప్రస్తుతం శ్రీలీల నటిస్తున్న చిత్రాల్లో జూనియర్ ఒకటి. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కిరీటి సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా బొమ్మరిల్లు భామ జెనీలియా తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక జూనియర్ సినిమా జూలై18 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈమధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా నిర్వహించారు. ఇదంతా పక్కన పెడితే వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీలీల సడన్ గా డెబ్యూ హీరోతో సినిమా చేయడం ఏంటి అని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల ఈ సినిమాను కేవలం కథ నచ్చడంతో పాటు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇవ్వడంతోనే ఒప్పుకుందని సమాచారం. స్టార్ హీరోయిన్స్.. కొత్త హీరోలతో సినిమాలు చేస్తున్నారు అంటే ఏదయితే అది కథ నచ్చడం కానీ, రెమ్యూనరేషన్ నచ్చడం కానీ అయ్యి ఉంటుందని అందరికీ తెల్సిందే.
ఇక జూనియర్ సినిమా కోసం శ్రీలీల గట్టిగానే పారితోషికం అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం జూనియర్ సినిమాకు ఈ చిన్నది అక్షరాలా రూ. 4 కోట్ల పారితోషకం అందుకుందని టాక్ నడుస్తుంది. మొదటి నుంచి అమ్మడు రెండు కోట్లు మాత్రమే డిమాండ్ చేస్తూ వచ్చింది. ఇక ఈ సినిమా కోసం మరో రెండు కోట్లు ఎక్స్ట్రాగా అందుకుందని అంటున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో కచ్చితంగా డబ్బు కోసమే శ్రీ లీల ఈ సినిమా చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం శ్రీలీల మాత్రమే చేయలేదు. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ సినిమా అల్లుడు శీను కోసం సమంత కూడా ఇదే పని చేసింది. ఆ సినిమా కోసం నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద బంగ్లా గిఫ్ట్ ఇచ్చాడని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని సురేష్ క్లారిటీ కూడా ఇచ్చాడు. కానీ, రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే ఇచ్చారని సమాచారం. ఏదిఏమైనా ఈ సినిమాతో శ్రీలీల ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ మీద ప్రేమ ఓకే కానీ.. మరీ పబ్లిక్ లో ఇలా చేస్తే ఎలా పాప