Mass Jathara Song: ఈ పాటకు అర్ధం లేదు పర్ధం లేదు.. తలా తోక అస్సలు లేదు

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:06 PM

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఈసారి మాస్ జాతర (Mass Jathara) సినిమాతో మంచి హిట్ కొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

Mass Jathara

Mass Jathara Song: మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఈసారి మాస్ జాతర (Mass Jathara) సినిమాతో మంచి హిట్ కొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మాస్ జాతర. ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ధమాకా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి నుంచి మాస్ జాతర సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే మాస్ జాతర చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం నుంచి రిలీజైన ఓలే ఓలే సాంగ్ ఎంత పెద్ద వివాదానికి దారితీసిందో అందరికీ తెల్సిందే. లిరిక్స్ లో అన్ని బూతులే ఉన్నాయని, ఆ సాంగ్ ను తీసేయాలని చాలామంది డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సూపర్ డూపర్ హిట్ సాంగ్ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

సాధారణంగా సందర్బాన్ని బట్టి సాంగ్ లో లిరిక్స్ ఉంటాయి. కానీ, ఈ సాంగ్ కు లిరిక్స్ అంటూ ఏం లేవు. అర్ధం లేదు పర్థం లేదు.. తలా తోక లేదు. రాగం, తాళం లేదు.. అంటూ పాదుకొచ్చారు. అయితే ఇవన్నీ లేకపోతేనే సూపర్ డూపర్ హిట్ సాంగ్ అవుతుందని సెటైర్ మాత్రం వేశారు. ఏదిఏమైనా సాంగ్ లో ఏమి లేకపోయినా ఆ మ్యూజిక్ లో ఒక వైబ్ మాత్రం ఉంది. రవితేజ- శ్రీలీల ఊర మాస్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. భీమ్స్ మ్యూజిక్ లో మ్యాజిక్ ఉంది. హేషమ్ అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరోలియో వాయిస్ లో గమ్మత్తు ఉంది. ఇవన్నీ ఉండడం వలన ఈ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Aneesh: విడుదలైన 'లవ్ ఓటీపీ' మూవీ ట్రైలర్

R Chandru: యో.. సినిమా చూసావా.. ఓజీ ఎక్కడ.. కబ్జా ఎక్కడ

Updated Date - Oct 22 , 2025 | 06:07 PM