R Chandru: యో.. సినిమా చూసావా.. ఓజీ ఎక్కడ.. కబ్జా ఎక్కడ
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:26 PM
కొన్ని కొన్నిసార్లు ఒక సినిమాలో ఉండే షాట్స్ ఇంకో సినిమాలో ఉన్నట్లు కనిపిస్తాయి. అలా అని.. ఆ సినిమా నుంచి ఈ సినిమా స్ఫూర్తి పొందింది అనలేం. అది డైరెక్టర్ ఆలోచనా విధానం ఒకేలా ఉంది అనుకోవాలి.
R Chandru: కొన్ని కొన్నిసార్లు ఒక సినిమాలో ఉండే షాట్స్ ఇంకో సినిమాలో ఉన్నట్లు కనిపిస్తాయి. అలా అని.. ఆ సినిమా నుంచి ఈ సినిమా స్ఫూర్తి పొందింది అనలేం. అది డైరెక్టర్ ఆలోచనా విధానం ఒకేలా ఉంది అనుకోవాలి. ప్రతి సినిమాలో ఇంకో సినిమా కనిపిస్తూనే ఉంటుంది. ఈ విషయాన్నీ కన్నడ డైరెక్టర్ ఆర్ చంద్రూ అర్ధం చేసుకుంటే మంచిది అని తెలుగు ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు.
తాజాగా డైరెక్టర్ ఆర్ చంద్రూ ఓకే ఇంటర్వ్యూలో ఓజీ సినిమా గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఓజీ ట్రైలర్ లో చాలావరకు తన సినిమా కబ్జాని చూసి స్ఫూర్తి పొందారని చెప్పుకొచ్చాడు. ట్రైలర్ లోని కొన్ని విజువల్స్ తన కబ్జా సినిమాలోని విజువల్స్ తో పోలి ఉన్నాయని, కబ్జా ఫ్లాప్ అయినప్పటికీ, తాను ఈ విషయంలో గర్వపడుతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, సుదీప్, శివన్న కీలక పాత్రల్లో కబ్జా ని తెరకెక్కించాడు ఆర్ చంద్రూ. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని అందుకుంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్లు.. కెజిఎఫ్ సినిమా చూసి దాని నుంచి స్ఫూర్తి పొంది కబ్జా తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓజీ స్ఫూర్తి పొందారు అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్లాప్ సినిమా నుంచి ఎవరైనా స్ఫూర్తి పొందుతారా.. అసలు నువ్వు సినిమా చూసావా.. ఓజీ ఎక్కడ.. కబ్జా ఎక్కడ అని పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Young Heroes: సినిమా మధ్యలో వేలు పెడతాం.. డైరెక్టర్స్ కు చుక్కలు చూపిస్తాం
Nara Rohith: పెళ్ళి పీటలపైకి నారా రోహిత్.. నాలుగు రోజులు వేడుక