Balakrishna- Sunny Deol : బాలయ్యతో సన్నీడియోల్ ఢీ

ABN, Publish Date - Apr 30 , 2025 | 04:05 PM

బాలయ్య మరో బ్లాస్టింగ్ కి రెడీ అవుతున్నాడు. బోయపాటితో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టిన నందమూరి నటసింహం ఈసారి నెక్ట్స్ లెవల్ అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాడు. అఖండ తాండవంలో అంతకుమించిన క్యాస్ట్ అండ్ క్రూ చేరడం సినిమా హైప్ ను ఆకాశానికి తీసుకెళ్తోంది.

నటసింహం బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో మాస్ ఎంటర్టైనర్ ‘అఖండ తాండవం’ (Akhanda Thandavam). ఈ సినిమా గురించి అభిమానుల్లో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెట్టింది పేరైన బోయపాటి ఈ మూవీతో మరోసారి తనదైన మేజిక్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. సెట్స్ నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ సినిమాకు కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే మహా కుంభమేళా, హిమాలయాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలో జార్జియాలో సినిమాలకూ హైలెట్ గా నిలిచే సీన్లను తెరకెక్కించనున్నారు. ఇలాంటి టైంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది.

Also Read: Manchu Vishnu: శ్రీవిష్ణు పై విష్ణు సీరియస్

Also Read: Dadasaheb Phalke: నగలు తాకట్టు పెట్టి భర్త ఫాల్కేతో సినిమా...


రీసెంట్ గా బాలయ్య పద్మ భూషణ్‌ అవార్డును అందుకోవడంతో అతని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రెజెంట్ బాలయ్య కూడా ఆ జోష్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే... వచ్చే వారం నుంచి జార్జియా (Georgia) లో 'అఖండ -2'కు సంబంధించిన యాక్షన్ పార్ట్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పటికే బోయపాటి లోకేషన్స్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' మూవీ (Gautamiputra Satakarni) షూటింగ్ చేసిన లోకేషన్ లో 'అఖండ-2' చిత్రీకరణ కూడా జరగుతుందని అంటున్నారు. ఇదే సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. టీటౌన్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం..‌. బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ (Sunny Deol) 'అఖండ 2' లో ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారట. ఇది కేవలం గెస్ట్ రోల్ అయినప్పటికీ.. కొన్ని కీలకమైన సీన్స్‌లో సన్నీబాయ్‌ తనదైన పెర్ఫార్మెన్స్ ను చూపించనున్నారని టాక్. అంతేకాదు ఈ పాత్ర... '‌అఖండ' యూనివర్స్‌లో మూడో భాగానికి దారి తీసే కీలక అంశంగా ఉంటుందని చెబుతున్నారు.

జార్జియాలో మొదలు కానున్న షెడ్యూల్ లోనే సన్నీ డియోల్ గెస్ట్ రోల్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ‘జాట్’ (Jaat ) సినిమాతో బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన సన్నీ డియోల్, ఇప్పుడు సౌత్ ఇండియన్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పవర్ ఫుల్ రోల్ లో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty ) కూడా కనిపించబోతున్నాడు. మొత్తంగా బాలయ్య యాక్షన్ డోస్, బోయపాటి మాస్ డైరెక్షన్, సన్నీ డియోల్ సర్‌ప్రైజ్ ఎంట్రీ కలిసి ‘అఖండ 2’కు మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ కాంబో థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: 3 Roses Season-2: బోల్డ్ అండ్ గ్లామరస్ గా కుషిత కల్లపు గ్లింప్స్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 30 , 2025 | 04:05 PM