Manchu Vishnu: శ్రీవిష్ణు పై విష్ణు సీరియస్

ABN , Publish Date - Apr 30 , 2025 | 03:49 PM

అది ఎప్పటికైనా అనర్థదాయకమే.. ఆ విషయాన్ని అల్లు ఫ్యామిలీ మర్చిపోయినట్టుంది. ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్ అయిన అరవింద్ తన సినిమా విషయంలో లైన్ క్రాస్ చేశాడని నెటిజన్స్ అంటున్నారు. లేటెస్ట్ ప్రాజెక్టులో మంచు ఫ్యామిలీని టార్గెట్ చేశాడని టాక్ నడుస్తోంది.

సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ (Manchu Family) పై ట్రోలింగ్‌ కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నాళ్ళుగా ఎవరికి హిట్స్ లేకపోవడం... ఫ్యామిలీ వివాదాలు కూడా తోడవడంతో ట్రోలర్స్‌కి ఫుల్ మసాలా దొరుకుతోంది. ఇప్పటికే వీటికి అలవాటు పడిపోయిన మంచు ఫ్యామిలీలో చాలామంది ఈ ట్రోలింగ్‌ని లైట్ తీసుకుంటున్నారు. కానీ, కొన్నిసార్లు నెటిజన్స్ లిమిట్స్ క్రాస్ చేయడం.. మంచు విష్ణు (Manchu Vishnu), మోహన్ బాబు సీరియస్ మోడ్ లోకి రావడం కూడా జరుగుతుంటుంది. అయితే ఇప్పటిదాకా బయటి వాళ్లే వీరి ఫ్యామిలీని సోషల్ మీడియాలో ట్రార్గెట్ చేసేవారు కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి చెందిన వారూ మంచు ఫ్యామిలీని టార్గెట్ చేయడం దుమారం రేపుతోంది.


తాజాగా శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా, అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మించిన ‘సింగిల్’ (Single) మూవీ ట్రైలర్‌లో రెండు డైలాగులు మంచు ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ని హర్ట్ చేశాయని టాక్ వినిపిస్తోంది. మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) టీజర్‌లో విష్ణు 'శివయ్యా' అని ఎమోషనల్‌గా అరిచే డైలాగ్ ఉంది. దాన్ని ‘సింగిల్’ ట్రైలర్‌లో శ్రీవిష్ణు కామెడీగా కాపీ కొట్టాడు. అంతే కాదు, ట్రైలర్ ఎండ్‌లో ఒక మగాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తే, అతని లైఫ్ మంచు కురిసినట్లు అవుతుంది అనే డైలాగ్ ఉంది. ఇక్కడ ‘మంచు’ అనే వర్డ్‌ని ఒక బూతు మాటకి రిప్లేస్‌మెంట్‌గా యూజ్ చేశారని, ఇది మంచు ఫ్యామిలీని డైరెక్ట్‌గా టార్గెట్ చేయడమేనంటూ కొందరు వాదిస్తున్నారు.

మంచు విష్ణు భక్తితో ‘కన్నప్ప’లో పలికిన సీరియస్ డైలాగ్‌ని కామెడీ చేయడం, పైగా మరో డైలాగ్‌తో ఇన్సల్టింగ్ వైబ్ ఇవ్వడంతో విష్ణు గట్టిగా రియాక్ట్ అయ్యాడట. అరవింద్ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ సినిమాలో ఇలాంటి డైలాగులు ఏంటి అని ఫైర్ అవుతున్నాడని తెలుస్తోంది. అంతే కాదు, ‘సింగిల్’ టీంకి లీగల్ నోటీసులు కూడా పంపే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఈ డైలాగ్స్ కాంట్రవర్సీపై ‘సింగిల్’ టీం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

Also Read: Dadasaheb Phalke: నగలు తాకట్టు పెట్టి భర్త ఫాల్కేతో సినిమా...

Also Read: 3 Roses Season-2: బోల్డ్ అండ్ గ్లామరస్ గా కుషిత కల్లపు గ్లింప్స్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 30 , 2025 | 03:49 PM