సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

China Peace movie: విడుదలే పెద్ద విజయం

ABN, Publish Date - Jul 27 , 2025 | 02:43 AM

నిహాల్‌ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ హీరోలుగా అక్కి విశ్వనాఽథ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై డ్రామా ‘చైనా పీస్‌’. మూన్‌ లైట్‌ డ్రీమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో...

నిహాల్‌ కోదాటి, సూర్య శ్రీనివాస్‌ హీరోలుగా అక్కి విశ్వనాఽథ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై డ్రామా ‘చైనా పీస్‌’. మూన్‌ లైట్‌ డ్రీమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కథానాయకుడు సందీప్‌ కిషన్‌ ఈ చిత్రం టీజర్‌ని లాంచ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఒక సినిమాను నిర్మించి రిలీజ్‌ చేయడమే పెద్ద సక్సెస్‌, ప్రేక్షకులకు సినిమా నచ్చితే బోన్‌సగా భావించాలి. ఇది ఒక స్పై ఫిల్మే కాదు..స్పై కామెడీ కథ కూడా. టీజర్‌ చాలా బాగుంది. సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నా’ అని అన్నారు. చిత్ర దర్శకుడు విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ ‘ఒక దేశభక్తి సినిమా తీస్తూ ‘చైనా పీస్‌’ అనే పేరు పెట్టడం సాహసమే. అన్ని విభాగాల్లోనూ జాగ్రత్తలు తీసుకొని చాలా చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దాం’ అని చెప్పారు. కార్యక్రమంలో హీరోలు నిహాల్‌, సూర్య శ్రీనివాస్‌, నటులు కమల్‌ కామరాజు, హర్షిత తదితరులు పాల్గొన్నారు.

Sunday Tv Movies: ఆదివారం, జూలై 27న.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Deviyani Sharma: అందాలను ఈ రేంజ్ లో ఆరబోస్తున్నా పట్టించుకోరేంటయ్యా

Updated Date - Jul 27 , 2025 | 02:43 AM