Deviyani Sharma: అందాలను ఈ రేంజ్ లో ఆరబోస్తున్నా పట్టించుకోరేంటయ్యా
ABN , Publish Date - Jul 26 , 2025 | 09:17 PM
ఇండస్ట్రీలో ఎదగాలంటే అందం, అభినయం మాత్రమే కాదు లక్ కూడా ఉండాలి. అలా లుక్ లేకపోవడం వలన టాలెంట్ ఉన్నా కూడా పైకి రాలేకపోతున్నవారు చాలామంది ఉన్నారు.
Deviyani Sharma: ఇండస్ట్రీలో ఎదగాలంటే అందం, అభినయం మాత్రమే కాదు లక్ కూడా ఉండాలి. అలా లక్ లేకపోవడం వలన టాలెంట్ ఉన్నా కూడా పైకి రాలేకపోతున్నవారు చాలామంది ఉన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించినా.. మొదటి సినిమా హిట్ తరువాత మరో హిట్ అందుకోలేకపోతున్న హీరోయిన్స్ కుప్పలుతెప్పలుగా ఉన్నారు. అలా అని వారందరూ ప్రేక్షకులకు దూరంగా ఉన్నారు అంటే పొరపాటే. నిత్యం సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ మేము దేనికైనా సిద్దమే అని చెప్పుకొస్తున్నారు.
ఇక అవకాశాల కోసం అందాలను ఆరబోస్తూ దేనికైనా సిద్ధం అనే నటీమణుల్లో దేవియాని శర్మ కూడా చేరింది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో ఎంతో పద్దతిగా.. లాయర్ గా కనిపించినా.. సైతాన్ సినిమాలో రక్తం కళ్లచూసి. జనాలను భయపెట్టినా దేవియానిలోని నటన మాత్రమే బయటకు కనిపిస్తుంది. టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు లేక మగ్గిపోతున్న నటీమణుల్లో దేవియాని కూడా ఉంది. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూదంది. చెడుగుడు ఆడేసుకుంటాను అని శపథం కూడా చేసేస్తుంది.
అవకాశాలు ఇంట్లో కూర్చుంటే రావు కదా. అందుకే తానేంటో.. తానేం చేయగలదో.. ఎలాంటి పాత్రలకు అయినా ఓకే చెప్పగలదో లేదో అనేది ఆమె సోషల్ మీడియా చూస్తేనే తెలిసేలా దేవియాని ఫోటోషూట్స్ తో అదరగొట్టేస్తుంది. చీరకట్టు నుంచి బికినీ వరకు.. మోడ్రన్ పాత్ర నుంచి అమ్మ పాత్ర వరకు ఎలాంటి పాత్రకు అయినా తాను సెట్ అవుతాను అని చెప్పుకొస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకే లేకుండా చేస్తుంది.
మొన్నటికి మొన్న వైట్ బికినీలో అందాలను ఆరబోసి షేక్ చేసిన దేవియాని.. తాజాగా బాత్ టబ్ లో ఎద అందాలను ఆరబోసి పిచ్చెక్కించింది. గ్లిట్టర్ బాడీ కాన్ డ్రెస్ లో అదరగొట్టేసింది. అయితే ఇంతగా అమ్మడు అందాలను ఆరబోసినా కూడా అమ్మడికి మాత్రం అవకాశాలు కరువయ్యాయి. ప్రస్తుతం దేవియాని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందాలను ఆరబోసినా ఏ డైరెక్టర్ పట్టించుకోవడం లేదంటయ్యా.. ఒకసారి చూడండి అమ్మడిని కూడా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ చిన్నదానికి ఎలాంటి అవకాశాలు వస్తాయి. అమ్మడి అందాల ఆరబోత ఆమె కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుంది అనేది చూడాలి.
Samantha: మళ్లీ అదే పని.. చైను వదలవా సామ్
Ruchi Gujjar: నడిరోడ్డుపై నిర్మాతను చెప్పుతో కొట్టిన హీరోయిన్