Sudigali Sudheer: ఆగిన గోట్.. మళ్లీ మొదలైంది

ABN , Publish Date - Nov 01 , 2025 | 06:46 PM

జబర్దస్త్ (Jabardasth) ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). కమెడియన్ గా.. యాంకర్ గా.. డ్యాన్సర్ గా మల్టీటాలెంట్ ఉన్న సుధీర్ తనకు వచ్చిన గుర్తింపుతో హీరోగా మారాడు.

Goat

Sudigali Sudheer: జబర్దస్త్ (Jabardasth) ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). కమెడియన్ గా.. యాంకర్ గా.. డ్యాన్సర్ గా మల్టీటాలెంట్ ఉన్న సుధీర్ తనకు వచ్చిన గుర్తింపుతో హీరోగా మారాడు. గాలోడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత రెండు సినిమాలు బోల్తా కొట్టడంతో బ్యాక్ టూ బుల్లితెర అంటూ యాంకర్ గా బిజీగా మారాడు. ఇక సుధీర్ నటించిన సినిమాల్లో గోట్ అనే సినిమా ఒకటి. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్ బ్యానర్స్ పై మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించాడు.

ఇక ఈ సినిమాలో కోలీవుడ్ హాట్ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాచిలర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యభారతి మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్దిరోజుల్లో రిలీజ్ అవుతుంది అనుకొనేలోపు ఈ సినిమా ఆగిపోయింది. బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో నిర్మాతలకు డైరెక్టర్ కు మధ్య విభేదాలు రావడంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇక ఇన్నాళ్లకు ఈ సినిమా రిలీజ్ కు మోక్షం దక్కింది.

డైరెక్టర్ సినిమా నుంచి తప్పుకోవడంతో.. మిగిలిన సినిమాను నిర్మాత మొగుళ్ళ చంద్రశేఖర్ నే పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గోట్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని తెలిపారు. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎదురుచూసిన వారందరికీ ధన్యవాదాలని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. మరి ఈ సినిమాతో సుధీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Karthi: రీ-రిలీజ్ మూవీస్ జాబితాలో చేరబోతున్న 'ఆవారా'....

Sudheer Babu: 'జటాధర'నుండి.. శివస్తోత్రం

Updated Date - Nov 02 , 2025 | 12:16 AM