Karthi: కార్తీ.. 'ఆవారా' రీ రిలీజ్! ఎప్పుడంటే

ABN , Publish Date - Nov 01 , 2025 | 06:23 PM

కార్తీ, తమన్నా జంటగా నటించిన 'ఆవారా' సినిమా మరోసారి జనం ముందుకు రాబోతోంది. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీని నవంబర్ 22న రీ-రిలీజ్ చేస్తున్నారు.

Aavara Movie

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో విడుదలై విజయం సాధించిన సినిమాలే కాదు... పరాజయం పాలైన సినిమాలను నిర్మాతలు రిలీజ్ చేసేస్తున్నారు. అయితే చిత్రంగా అప్పుడు పెద్దంత ఆదరణకు నోచుకోని చిన్న హీరోల సినిమాలు సైతం ఇప్పుడు ఏదో ఒక స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

కొన్ని సినిమాలు రిలీజ్ సమయంలో కంటే.. రీ-రిలీజ్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టి అదరహో అనిపిస్తున్నాయి. ఇలా రీ-రిలీజ్ సినిమాలు ఎంజాయ్ చేస్తున్నా సినీ లవర్స్‌కు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘ఆవారా’ చిత్రం రీ-రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.

WhatsApp Image 2025-11-01 at 6.07.57 PM.jpeg


కార్తీ, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన 'ఆవారా' సినిమాను ఎన్. లింగుస్వామి డైరెక్ట్ చేశారు. 2010లో వచ్చిన ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయ్యింది, సాంగ్స్‌ యూత్‌ను కట్టిపడేశాయి. ఇప్పటికీ ఈ సాంగ్స్ వినపడుతూనే ఉంటాయి. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'ఆవారా'ను నవంబర్ 22న తిరిగి రిలీజ్ చేస్తున్నారు. మరి కార్తీ అభిమానులు, తమన్నా అభిమానులు ఈ సినిమాను ఇప్పుడెంతగా ఆదరిస్తారో చూడాలి.

Also Read: Biker First Lap: ఏం జరిగినా పట్టు వదలని మొండోడి కథ.. అదిరిపోయిన బైకర్ గ్లింప్స్

Also Read: Kanchana 4: ఇటు పూజా హెగ్డే, అటు నోరా ఫతేహీ నడుమ లారెన్స్...

Updated Date - Nov 02 , 2025 | 12:17 AM