Jatadhara Trailer: ధన పిశాచి మారణకాండ.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జటాధర ట్రైలర్

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:48 PM

నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu) ఎన్నో ఏళ్లుగా ఒక మంచి విజయం కోసం ఎదురుచుస్తున్నాడు.

Jatadhara

Jatadhara Trailer: నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu) ఎన్నో ఏళ్లుగా ఒక మంచి విజయం కోసం ఎదురుచుస్తున్నాడు. ట్రెండ్ కు తగ్గట్లే సినిమా కథలను ఎంచుకున్నా కూడా ఆయనకు కలిసి రాలేదు. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్.. అలా సుధీర్ ప్రయత్నించని జానర్ లేదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో హారర్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సుధీర్ సైతం అలాంటి ఒక హారర్ కాన్సెప్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

సుధీర్ బాబు హీరోగా వెంకట్ కళ్యాణ్ & అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జటాధర. ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా తెలుగుతెరకు పరిచయం కానుంది. ఇక ఈ చిత్రంలో మహేష్ మరదలు శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే జటాధర నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుది. దెయ్యాలను వెతికి కనిపెట్టే ఘోస్ట్ హంటర్ గా సుధీర్ బాబు కనిపించగా.. ధన పిశాచిగా సోనాక్షి కనిపించింది.

కథ విషయానికొస్తే.. హీరో ఒక ఘోస్ట్ హంటర్. దెయ్యాలు లేవు అని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. పూర్వ కాలం ధనాన్ని భూమిలో దాచి వాటిని ఎవరు తీయకుండా బంధనాలు వేసేవారు. అందులో భయంకరమైన బంధనం ధన పిశాచి బంధనం. శిల్పా శిరోద్కర్ ఇంట్లో ఒక చిన్న తప్పు వలన ఆ బంధనం తెగి ధన పిశాచి బయటకు వస్తుంది. అప్పటి నుంచి సమస్యలు మొదలవుతాయి. అసలు ఈ ధన పిశాచికి హీరోకి సంబంధం ఏంటి..? హీరో కలలో కనిపించే బాబు ఎవరు.. ? ధన పిశాచిని హీరో గెలవగలడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ట్రైలర్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ముఖ్యంగా చివరి రెండు డైలాగ్ లు.. శివుడి షాట్స్ అయితే వేరే లెవెల్. విశ్వం ఎక్కడ అంతం అవుతుందో.. శివుడు అక్కడ మొదలవుతాడు. అతని తలంపు.. ఈ విశ్వం.. అతని తాండవం.. దాని విధ్వంసం. ఈ డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి. ధన పిశాచిగా సోనాక్షి వేరే లెవెల్ లో కనిపించింది. గెటప్, హవాభావాలు.. సుధీర్ తో ఫైట్.. సినిమాకు ఆమెనే హైలెట్ అని చెప్పొచ్చు. ఇక లాస్ట్ షాట్ లో సుధీర్ బ్లడ్ ను నాకడం అయితే శరీరం అంతా షేక్ అవుతుంది. మొత్తానికి ట్రైలర్ తోనే హైప్ క్రియేట్ చేశారు. ఇకపోతే ఈ సినిమా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సుధీర్ బాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా చూడాలి.

Vijay Devarakonda: హిట్ కోసం విజయ్ కష్టాలు.. మంచి డైరెక్టర్ నే పట్టాడు

Bison: ధృవ్ సినిమా నుండి సెకండ్ సింగిల్

Updated Date - Oct 17 , 2025 | 04:59 PM