Bison: ధృవ్ సినిమా నుండి సెకండ్ సింగిల్

ABN, Publish Date - Oct 17 , 2025 | 04:17 PM

తమిళ సీనియర్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ నటిస్తున్న 'బైసన్' చిత్రం శుక్రవారం తమిళనాట విడుదలైంది. ఈ సినిమాను 24వ తేదీ తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఆ సందర్భంగా ఇందులోని సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 'మంచి మనసు...' అంటూ సాగే ఈ పాటను దర్శకుడు మారి సెల్వరాజ్ తమిళంలో రాయగా, తెలుగులో యనమండ్ర రామకృష్ణ రచన చేశారు. దీన్ని మనువర్థన్, గాయత్రి సురేశ్‌ పాడారు. పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను తెలుగులో జగదంబ ఫిలిమ్స్ బ్యానర్ పై బాబ్జీ విడుదల చేస్తున్నారు.

Updated at - Oct 17 , 2025 | 04:17 PM