SSMB29: గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్ అప్పుడే.. జక్కన్న అప్‌డేట్ అదిరింది..
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:55 AM
మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.
మహేశ్‌బాబు (Mahesh Babu)పుట్టినరోజు సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) చిత్రానికి సంబంధించి అధికారికంగా ఆయన పోస్టర్ రివీల్ చేశారు. ‘గ్లోబ్‌ట్రోటర్’ (GlobeTrotter)eఅంటూ ఓ ప్రీ లుక్‌ను షేర్ చేసి ఫస్ట్ లుక్ నవంబర్ నెలలో వస్తుందని చెప్పారు. ఈ పోస్ట్‌కు #GlobeTrotter అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసారు రాజమౌళి. GlobeTrotter అంటే ప్రపంచాన్ని చుట్టి వచ్చే యాత్రికుడు అని పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
సినిమా గురించి కూడా రాజమౌళి ఓ నోట్ విడుదల చేశారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, మహేశ్ ప్యాన్స్‌కు, మేం ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల మొదలుపెట్టాం. దీనిపై ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి చూసి ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా భారీ స్థాయిలో రానుంది. కేవలం ప్రెస్‌మీట్ పెట్టి లేదా కొన్ని లుక్స్ రివీల్ చేయడం వల్ల కథకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేము.దీనిని హ్యూజ్ స్పాన్ ఉన్న సినిమాగా రూపొందిస్తున్నాం. నవంబర్ 2025లో మహేశ్ లుక్‌ను విడుదల చేస్తాం. ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా దీన్ని రూపొందిస్తున్నాం. మీరంతా సహకరిస్తారని ఆశిస్తున్నాం. మీ ఓర్పుకు ధన్యవాదా లు’ అని పేర్కొన్నారు.
దీనికి మహేశ్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. రాజమౌళి ట్వీట్‌కు ‘నేనూ ఎదురుచూస్తున్నా’ అంటూ రిప్లై ఇచ్చారు. ‘మీలాగే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నవంబర్‌లో మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తా’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం రాజమౌళి వదిలిన లుక్ ఆసక్తికరంగా ఉంది. అందులో మెడలో దండ.. దానికి శివుని డమరుకం, శూలం, అడ్డు నామాలు, నంది, రుద్రాక్ష కనిపిస్తున్నాయి.
ALSO READ: Nithin: నితిన్‌తో పూజా.. విక్రమ్ సక్సెస్ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా..
Kantara: Chapter 1: కాంతార షూట్.. మరో మరణం.. కారణమేంటి