Pedddi: పెద్ది కోసం కిస్సిక్ బ్యూటీ.. థియేటర్లు ఉండడానికేనా..
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:04 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది (Peddi). ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Pedddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది (Peddi). ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ మాత్రమే కాదు పాన్ ఇండియా మొత్తం ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇక తాజాగా పెద్ది సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో కూడా రంగస్థలంలో ఉన్నట్లే ఒక ఐటెంసాంగ్ ఉందట. ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్ గా ఈ సాంగ్ ను తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ లో చరణ్ పక్కన చిందేయ్యడానికి అందాల భామ శ్రీలీల ను రంగంలోకి దించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు.. స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇప్పటికే శ్రీలీల.. కిస్ కిస్ కిస్సిక్ అంటూ పుష్ప 2 లో బన్నీ సరసన ఆడిపాడింది.
కిస్సిక్ సాంగ్ శ్రీలీల రేంజ్ నే మార్చేసింది. అందుకే చరణ్ కు ధీటుగా డ్యాన్స్ వేసే హీరోయిన్ కోసం వెతికి వెతికి చివరకు శ్రీలీల వద్ద వచ్చి ఆగాడట బుచ్చిబాబు. ఇక ఇప్పటికే శ్రీలీలను సంప్రదించగా అమ్మడు కూడా సై అనేసిందని సమాచారం. త్వరలోనే వీరి మధ్య సాంగ్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారట. ఇదే కనుక నిజం అయితే థియేటర్ లో వీరిద్దరి డ్యాన్స్ కు బాక్సులు బద్దలు అవ్వడం ఖాయమే అని చెప్పాలి. నిజం చెప్పాలంటే శ్రీలీలకు ఈ మధ్య ఐటెంసాంగ్స్ నే బాగా పేరు తెస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే పరాజయాలతోనే నెట్టుకొస్తోంది. ప్రస్తుతం అమ్మడి ఆశలన్నీ మాస్ జాతర పైనే పెట్టుకుంది. మరి ఆ సినిమా అమ్మడికి హిట్ ను అందిస్తుందా.. ? లేక మళ్లీ పెద్ది లోని ఐటెంసాంగ్ తోనే పేరు తెచ్చుకుంటుందా.. ? అనేది చూడాలి.
Anushka Shetty: ఘాటీ.. రిలీజ్ డేట్ తోనే వస్తుందా..
Kingdom: మురగా.. ఇప్పుడెందుకురా