Anushka Shetty: ఘాటీ.. రిలీజ్ డేట్ తోనే వస్తుందా..
ABN , Publish Date - Aug 05 , 2025 | 09:44 PM
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anuhska Shetty) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న స్వీటీ.. ఇప్పుడు ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Anushka Shetty: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anuhska Shetty) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న స్వీటీ.. ఇప్పుడు ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటిస్తున్న చిత్రం ఘాటీ (Ghaati). వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వేదం లాంటి భారీ హిట్ సినిమా వచ్చిన విషయం అందరికీ తెల్సిందే. చాలా కాలం తరువాత క్రిష్.. స్వీటీతో ఘాటీ కోసం జతకట్టాడు. ఈ సినిమా కోసమే హరిహర వీరమల్లును కూడా పక్కకు పెట్టేశాడని వార్తలు వినిపించాయి.
ఘాటీ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. మొట్ట మొదటిసారి అనుష్కలోని ఇంకో యాంగిల్ ను క్రిష్ బయటపెట్టాడు. అన్ని మంచిగా కుదిరితే ఈపాటికే ఘాటీ రిలీజ్ అయ్యి నెల ఉండేది. కానీ, కొన్ని కారణాల వలన ఆగుతూ వచ్చింది. మధ్యలో రిలీజ్ డేట్ అప్డేట్ ను కూడా ఏది ఇవ్వలేదు.
ఇక తాజాగా ఘాటీ నుంచి మేకర్స్ ఒక అద్భుతమైన అప్డేట్ ను అందించారు. ఎట్టకేలకు ఘాటీ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. ఆగస్టు 6 న సాయంత్రం 4. 45 నిమిషాలకు ఘాటీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేస్తారా.. ? అనే డైలమాలో అభిమానులు ఉన్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఘాటీ సెప్టెంబర్ 5 న రిలీజ్ కానుందని తెలుస్తోంది. అందుకే ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారని టాక్. మరి ఈ సినిమాతో అనుష్కఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Kingdom: మురగా.. ఇప్పుడెందుకురా
Aamir Khan: రూ. 2 వేల కోట్ల ఆస్తులకు అధిపతి.. కానీ, అద్దె ఇంట్లో .. ఎందుకో తెలుసా