Kingdom: మురగా.. ఇప్పుడెందుకురా
ABN , Publish Date - Aug 05 , 2025 | 08:20 PM
పెద్దలు ఏదో సామెత చెప్తారు.. చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అని.. ఇప్పుడు తమిళ తంబీలు అదే పని చేస్తున్నారు.
Kingdom: పెద్దలు ఏదో సామెత చెప్తారు.. చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అని.. ఇప్పుడు తమిళ తంబీలు అదే పని చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యి ఐదు రోజులు అవుతుంటే.. ఇప్పుడొచ్చి సినిమాను నిలిపివేయమని నిరసనలు చేయడం చాలా విడ్డూరంగా ఉందని తెలుగు ప్రేక్షకులు నోర్లు నొక్కుకుంటున్నారు. అసలు ఏమైంది.. ? ఏ సినిమా.. తమిళ తంబీల మనోభావాలను దెబ్బతీసింది. ఎందుకు వారు సినిమా ఆపాలని రోడ్డెక్కారు.. ? అనేది తెలుసుకుందాం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో వెంకిటేష్ విపి, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఎన్నో అంచనాల నడుమ జూలై 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. చాలామందికి కింగ్డమ్ సినిమా నచ్చలేదు. నచ్చలేదు అని చెప్పడం కన్నా.. సెకండాఫ్ లో అసలు కథే లేదు అని చెప్పొచ్చు. అసలు ఏ సీన్స్ వచ్చి ఏ సీన్స్ ను కలుస్తున్నాయో. హీరో ఎవరో.. విలన్ ఎవరో.. అన్నదమ్ములు ఎందుకు కలిశారో.. అసలు అన్న ఎందుకు చనిపోయాడో.. పోలీస్ అని వెళ్లిన హీరో రాజు ఎలా అయ్యాడో ఇవన్నీ అర్ధం చేసుకోవడానికే సగం సమయం అయ్యిపోయింది.
జెర్సీ లాంటి సినిమా తీసిన డైరెక్టర్ యేనా ఇలాంటి సినిమా తీసింది అని ప్రేక్షకులు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈ వారం రోజుల్లో మొదటి రోజు అంతంతమాత్రంగా కలక్షన్స్ సాధించిన కింగ్డమ్ ఐదు రోజుల్లో షాక్ ఇచ్చింది. దీనికన్నా యానిమేటెడ్ మహావతార్ నరసింహకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. సరే అక్కడక్కడా అయినా కింగ్డమ్ ఆడుతుందిలే అనుకుంటే.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అనే చందాన తమిళనాడులో కింగ్డమ్ కు నిరసన సెగ తగిలింది. సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యిన తెల్లారే ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే.. వెంటనే సినీమము ఆపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తారు. కానీ, ఈ తమిళతంబీలు కొద్దిగా స్లో అనుకుంటా.. కింగ్డమ్ రిలీజ్ అయిన ఐదు రోజులకు కింగ్డమ్ సినిమాను ఆపాలని థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు.
అసలు తమిళ తంబీలను అంతగా హర్ట్ చేసిన విషయం కింగ్డమ్ సినిమాలో ఏముంది అంటే.. ఈ సినిమాలో శ్రీలంక తమిళీయన్స్ ను నేరస్థులుగా చూపించారని, విలన్ కు మురుగన్ అనే పేరును పెట్టారని, అంతేకాకుండా ఈలం అనే కులం తెగవారిని అవమానించారని, వెంటనే ఆ సినిమాను ఆపేసి.. థియేటర్ నుంచి తీసివేయాలని సదురు వ్యక్తులు డిమాండ్ చేశారు. అసలేం జరుగుతుందిరా.. అందులో అంత కథ లేదు కదా.. ? ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు అని తెలుగువారు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు.. మురగా గొడవ ఇప్పుడెందుకు అయ్యా.. ఇంకో రెండు రోజులు ఉంటే ఆ సినిమానే వెళ్ళిపోతుందిగా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి అనవసరంగా ఈ గొడవలు ఏంటో.. ? దీనిపై చిత్ర బృందం ఏమంటారో చూడాలి.
Aamir Khan: రూ. 2 వేల కోట్ల ఆస్తులకు అధిపతి.. కానీ, అద్దె ఇంట్లో .. ఎందుకో తెలుసా
Jr Ntr: ఏదీ ప్లాన్ చేయను.. కానీ అలా గుర్తుండిపోవాలనుకుంటా..