సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pranav Mohan Lal: తెలుగులోకి.. మోహ‌న్‌లాల్ కుమారుడి చిత్రం

ABN, Publish Date - Oct 27 , 2025 | 07:06 PM

మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌ లాల్‌ తనయుడిగా చిత్రసీమలో అడుగు పెట్టిన ప్రణవ్‌, అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక స్పెషల్‌ మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నారు. ‘హృదయం’తో ఆకట్టుకున్న  ఆయన తాజాగా నటించిన చిత్రం ‘డియాస్‌ ఇరాయ్‌’.

మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌ లాల్‌ తనయుడిగా చిత్రసీమలో అడుగు పెట్టిన ప్రణవ్‌(Pranav Mohanlal), అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక స్పెషల్‌ మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నారు. ‘హృదయం’తో ఆకట్టుకున్న  ఆయన తాజాగా నటించిన చిత్రం ‘డియాస్‌ ఇరాయ్‌(Dies Irae)’ . మిస్టరీ హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో శ్రీ స్రవంతి మూవీస్‌ (Sravanti movies) సంస్థ విడుదల చేస్తోంది.

‘హృదయం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ప్రణవ్‌ మోహన్‌ లాల్‌ వరుసగా సినిమాలు చేయలేదు. సెలక్టివ్‌గా కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. ‘భూతకాలం’, మమ్ముట్టి ‘భ్రమ యుగం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్‌ సదాశివన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్‌ 31న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో  ‘డియాస్‌ ఇరాయ్‌’ మలయాళ వెర్షన్‌ డిస్ర్టిబ్యూట్‌ చేస్తున్నారు నిర్మాత స్రవంతి రవికిశోర్‌. సుష్మితా భట్‌, జిబిన్‌ గోపీనాథ్‌, జయ కురుప్‌, మనోహరి జాయ్‌, అరుణ్‌ అజికుమార్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను నవంబర్‌ తొలి వారంలో థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో రూపొందిన 'డియాస్ ఇరాయ్' చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంస్థలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. 

Updated Date - Oct 27 , 2025 | 07:27 PM