Kanappa: రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప ప్రత్యేక ప్రదర్శన
ABN, Publish Date - Jul 16 , 2025 | 07:42 PM
మంచు విష్ణు (Manchu Vishnu).. తెలుగువారి గౌరవాన్ని పెంచేశాడు. ఆయన నటించిన కన్నప్ప (Kannappa)సినిమాను తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శించారు.
Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu).. తెలుగువారి గౌరవాన్ని పెంచేశాడు. ఆయన నటించిన కన్నప్ప (Kannappa)సినిమాను తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రదర్శించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు మొత్తానికి స్పెషల్ స్క్రీనింగ్ లో చూపించారు. శివ భక్తుడు కన్నప్పచరిత్ర చూసి మరోసారి అందరూభక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం మంచు విష్ణు. మంచు మోహన్ బాబును ప్రశంసించారు. మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
మంచు ఫ్యామిలీ మీద ఉన్న నెగిటివిటితో కన్నప్ప సినిమా మరోసారి పరాజయం పాలవుతుందని అనుకున్నారు. కానీ, మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ లో ప్రభాస్ ఎంట్రీ.. క్లైమాక్స్ లో విష్ణు నటన చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. భారీ విజయం తో పాటు రికార్డ్ కలక్షన్స్ రాబట్టి షాక్ ఇచ్చింది. చాలా గ్యాప్ తరువాత విష్ణు ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక మోహన్ బాబు సైతం ఇదంతా శివుని ఆశీర్వాదం అని చెప్పుకొచ్చాడు. ఇక కన్నప్ప సినిమాను ఓటీటీలో కూడా ఇప్పుడప్పుడే స్ట్రీమింగ్ చేయమని మేకర్స్ తెలిపారు.
ఇక ఇప్పుడు కన్నప్ప నేషనల్ లెవెల్ లో పేరు తెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రపతి భవన్ లో చాలా రేర్ గా తెలుగు సినిమాలను ప్రదర్శించారు. కన్నప్ప కూడా అందులో ఒకటి కావడం విశేషం అని చెప్పొచ్చు. ఇక ఈ గుర్తింపుతో విష్ణు కూడా పాన్ ఇండియా హీరోగా మారిపోయసాడు. మరి కన్నప్ప తరువాత విష్ణు ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.
The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. రాజాసాబ్ మళ్లీ వాయిదా
Bellamkonda: 'కిల్'తో బెల్లంకొండ