The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. రాజాసాబ్ మళ్లీ వాయిదా

ABN , Publish Date - Jul 16 , 2025 | 07:19 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాలు అనుకున్న సమయానికి వస్తే ఆశ్చర్యపడాలి కానీ, వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తే ఆశ్చర్యం దేనికి అని అంటున్నారు నెటిజన్స్.

The Rajasaab

The Rajasaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాలు అనుకున్న సమయానికి వస్తే ఆశ్చర్యపడాలి కానీ, వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తే ఆశ్చర్యం దేనికి అని అంటున్నారు నెటిజన్స్. ఒక్క సినిమా కద్దు రెండు సినిమాలు కాదు.. డార్లింగ్ ప్రతి సినిమా ఎప్పుడూ మొదటి రిలీజ్ డేట్ కు రాలేదు. ఇక ఇప్పుడు ది రాజాసాబ్ కూడా అంతే అని టాక్ నడుస్తోంది. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ది రాజాసాబ్ (The Rajasaab). పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.


ఇక రాజాసాబ్ లో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు. అసలైతే ఇప్పటికే రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, హర్రర్ కామెడీ సినిమా కావడంతో విజువల్ వండర్ గా ఉండాలని ఎంతో కష్టపడి విఎఫ్ఎక్స్ చేయించారని అందుకే టైమ్ పడుతుందని టాక్. మధ్యలో పెద్ద పెద్ద సినిమాలు ఉండడంతో చివరికి క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 5 న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.


లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంది కదా అని అభిమానులు పండగ చేసుకున్నారు. టీజర్ లో ప్రభాస్ లుక్ చాలా బావుండడంతో.. టీజర్ లోనే ఇలా ఉంది అంటే సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో అనుకోని ఎప్పుడెప్పుడు డిసెంబర్ వస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశపడక తప్పదు అనే మాట వినిపిస్తుంది. డిసెంబర్ లో కూడా రాజాసాబ్ వాయిదా పడిందని రూమర్స్ వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9 న రాజాసాబ్ రిలీజ్ కు రెడీ అవుతుందని టాక్.


ఇంత సడెన్ గా రాజాసాబ్ వాయిదా పడడానికి కారణం ఏంటి అంటే.. మార్కెట్. డిసెంబర్ లో అయితే రాజాసాబ్ లాంటి బడ్జెట్ సినిమాకు అంతగా కలిసిరాదు కాబట్టి.. సంక్రాంతి అయితే మంచి కలక్షన్స్ రాబట్టి పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందుకే ఇప్పటివరకు డిజిటల్ రైట్స్ ను కూడా అమ్మలేదని టాక్. అయితే రాజాసాబ్ సంక్రాంతికి వస్తే ఓటీటీలతో సమస్య ఉంది. ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు అన్ని తమ తమ స్లాట్స్ ను బుక్ చేసుకున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అయితే డీల్స్ క్లోజ్ కూడా చేసేసుకున్నాయి. ప్రస్తుతం హాట్ స్టార్ ఒక్కట్టే ఖాళీగా ఉంది.ఇది కూడా వేరే సినిమాను బుక్ చేసేస్తే .. రాజాసాబ్ కు ఓటీటీ దొరకడం కష్టమే. ఈ ఓటీటీని బట్టి మేకర్స్ రాజాసాబ్ సంక్రాంతికి వస్తున్నాడా.. ? డిసెంబర్ లోనే దిగుతాడా.. ? అనేది కన్ఫర్మ్ చేస్తారు. మరి రాజాసాబ్ ఎప్పుడు వచ్చేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Kota Srinivasarao: చిరు తో మొదలు... పవన్ తో ముగింపు...

Tanya Ravichandran: లిప్ లాక్ పెట్టి మరీ ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్

Updated Date - Jul 16 , 2025 | 07:19 PM