Meenaakshi Chaudhary: ఓ రోజు ఆలస్యంగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్...

ABN , Publish Date - Nov 03 , 2025 | 01:28 PM

చేవెళ్ళలో జరిగిన రోడ్డు దుర్ఘటనతో నాగచైతన్య తాజా చిత్రం నుండి హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ లాంచ్ ను మేకర్స్ వాయిదా వేశారు. మంగళవారం లుక్ ను రివీల్ చేయబోతున్నట్టు తెలిపారు.

NC24 Movie

సుశాంత్ హీరోగా నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' (Ichata Vahanamulu Niluparadu) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి (Meenaakshi Chaudhary) . ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయినా... మీనాక్షి చౌదరికి వరసగా అవకాశాలు వచ్చాయి. దాంతో స్లో అండ్ స్టడీగా ముందుకు సాగుతూ ఉంది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) మూవీ మీనాక్షి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఇంతవరకూ ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు.


వచ్చే యేడాది సంక్రాంతికి రాబోతున్న 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju) లోనూ మీనాక్షి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే... అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) కూతురు నాగసుశీల కొడుకైన సుశాంత్ (Sushanth) మూవీలో హీరోయిన్ గా చేసిన మీనాక్షి చౌదరి... ఇప్పుడు నాగేశ్వరరావు కొడుకు నాగార్జున (Nagarjuna) తనయుడు నాగచైతన్య తో జోడీ కడుతోంది. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ (BVSN Prasad) నిర్మిస్తున్న చిత్రంలో మీనాక్షి చౌదరి... నాగచైతన్యకు జంటగా నటిస్తోంది. సో... బావబావమరిది ఇద్దరితోనూ అమ్మడు జోడీ కట్టినట్టు అయ్యింది.


WhatsApp Image 2025-11-03 at 10.11.21 AM.jpeg

ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి పాత్రను, ఫస్ట్ లుక్ తో పాటు రివీల్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. ఆ విషయాన్ని తెలియచేస్తూ, ఆదివారం ప్రకటన ఇచ్చారు. కానీ సోమవారం ఉదయం చేవెళ్ళలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన వార్త తెలిసి, మూవీ మేకర్స్ తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేస్తూ, ఇలాంటి విషాదకర సంఘటన నడుమ తమ హీరోయిన్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేయాలని అనుకోవడం లేదని, మంగళవారం పోస్టర్ ను విడుదల చేస్తామని తెలిపారు. నాగచైతన్య నటిస్తున్న ఈ 24వ చిత్రానికి అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Chandini Chowdary: 'సంతాన ప్రాప్తిరస్తు' విడుదలకు ముందే కొత్త సినిమా...

Also Read: Dude OTT: ఓటీటీకి.. వ‌చ్చేస్తున్న‌ 'డ్యూడ్’! ట్రోలింగ్.. ఏ రేంజ్‌లో ఉంటుందో

Updated Date - Nov 03 , 2025 | 01:29 PM