RGV: వామ్మో రాంగోపాల్ వర్మా.. ఏందయ్యా ఇది! మళ్లీ ఏం.. ఫ్లాన్ చేశావయ్యా
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:47 PM
చాలా కాలం విరామం తర్వాత దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తిరిగి బాలీవుడ్ బాట పట్టి తెరకెక్కిస్తున్న చిత్రం పోలీస్ స్టేషన్ మే భూత్.
చాలా కాలం విరామం తర్వాత దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) తిరిగి బాలీవుడ్ బాట పట్టి తెరకెక్కిస్తున్న చిత్రం పోలీస్ స్టేషన్ మే భూత్ (Police Station Mein Bhoot). మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee), జెనీలియా (Genelia Deshmukh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబయ్‌లో శర వేగంగా జరుగుతోంది.
అయితే రెండు రోజుల క్రితం కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా ఉన్న ఓ హీరోయిన్ ఫొటోను సోషల్ మీడియాలో చేసి ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ పోస్ట్ పెట్టిన ప్రేక్షకులకు చిన్న టెస్ట్ పెట్టాడు.
వర్మ తాజాగా ఆ పూర్తి ఫొటోను రివీల్ చేశాడు. అలనాటి కథానాయిక రమ్యకృష్ణ (Ramya Krishna) ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తుందని వెల్లడించాడు. అయితే భూతం పాత్ర మాత్రం కాదని స్పష్టం చేశాడు. ఇదిలాఉంటే.. వర్మ రిలీజ్ చేసిన ఫొటోలో రమ్యకృష్ణ నెవర్ బి ఫోర్ లుక్‌లో దర్శనమిచ్చి చూసే వారిని షాక్‌కు గురి చేసింది.
ఆ చిత్రాలు చూసిన వారంతా ఖంగు తింటున్నారు. శివగామి వంటి చిరస్మరణీయ పాత్రతో ప్రజలందరి గుండెలో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న రమ్య కృష్ణను ఈ అల్ట్రా మోడ్రన్ లుక్‌లో చూడలేక పోతున్నారంటే అతిశయోక్తి కాదు.
ఇదిలాఉంటే.. సినిమాలో రమ్య కృష్ణ మోడ్రన్ భూత వైద్యురాలి పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పాత్రకు సంబంధించిన ఫొటోలు చూసిన వారంతా ఏందిరా అసలు ఏం జరుగుతుందిరా... రమ్య కృష్ణ ఇలా తయారయిందేంట్రా అని మాట్లాడుకుంటున్నారు. అంతేగాక 'బాబూ... వర్మా... మళ్లీ ఏం కళాఖండం తయారు చేస్తున్నావయ్యా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.