సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Telusu Kada Second Single: తెలుసు కదా.. లిప్ లాక్ తో సిద్దు రెచ్చిపోయాడుగా

ABN, Publish Date - Sep 23 , 2025 | 06:58 PM

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టిల్లు స్క్వేర్ తరువాత జాక్ సినిమాతో వచ్చాడు. అది భారీ డిజాస్టర్ గా నిలిచింది

Telusu Kada

Telusu Kada Second Single: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) టిల్లు స్క్వేర్ తరువాత జాక్ సినిమాతో వచ్చాడు. అది భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆ డిజాస్టర్ నుంచి బయటపడడానికి తెలుసు కదా (Telusu Kada) అనే సినిమాతో వస్తున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్‌ నీరజ కోన ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్‌లు నిర్మించిన ఈ చిత్రంలో సిద్ధూ సరసన శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకోగా ఫస్ట్ సింగిల్ మల్లికా గంధ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.


తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ సొగసు చూడతరమా సాంగ్ ను హీరోయిన్ నయనతార లాంచ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపింది. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. లేట్ నైట్ అవుతుందని సిద్ధూ బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, శ్రీనిధి తన వాచ్ సమయాన్ని రీసెట్ చేస్తుంది, ఆమె ఇంకా వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా లేదని చూపించే సైన్ ఇదని ఎంతో చక్కగా తెలిసిపోతుంది. ఇక ఇందులో శ్రీనిధి పేరు రాగ అని తెలుస్తోంది. ఆమెను ఉద్దేశించి ఈ సాంగ్ లిరిక్స్ ను రాసినట్లు క్లియర్ గా అర్దమవుతుంది.


ఇప్పటివరకు హీరో లైఫ్ ఎలా ఉన్నా.. రాగ వచ్చాక పూర్తిగా మారిపోయినట్లు, అదే ప్రేమ అన్నట్లు సిద్దు పాడుతున్న లైన్స్ చాలా అద్బుతంగా ఉన్నాయి. ఈ ట్రాక్‌తో థమన్ మరో అద్భుతమైన కంపోజిషన్ అందించాడు. బాస్‌లైన్, డ్రమ్‌బీట్, ట్రంపెట్ పాటకు రెట్రో వైబ్‌ను ఇచ్చింది. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. కార్తీక్, అద్వితీయ వొజ్జల మెస్మరైజింగ్ వాయిస్ మరో ఎత్తు. ఎంతో ఫ్రెష్ గా.. మనసుకు హాయిగా అనిపించేలా ఈ సాంగ్ ఉంది. ఇక చాలా క్యూట్ గా సిద్దు స్టెప్స్, ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి. థమన్ సంగీతం గురించి చెప్పాలసిన అవసరం లేదు.


విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సిద్దు - శ్రీనిధి కెమిస్ట్రీకి ఆ విజువల్స్ మరింత అందాన్ని చేకూర్చాయి. ఇక చివర్లో సిద్దు లిప్ లాక్ హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. అక్టోబర్ 17 న ఈ సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. మరి ఈ సినిమాతో సిద్దు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Sai Pallavi: బికినీలో సాయి పల్లవి.. చీర కట్టుకొని స్విమ్ చేస్తారా

Kalyani Priyadarshan: రూమర్స్‌పై స్పందించిన మలయాళ బ్యూటీ..

Updated Date - Sep 23 , 2025 | 06:58 PM