Sobhita Akkineni: ఆ విషయంలో సమంత కంటే శోభితా వెయ్యి రెట్లు బెటర్

ABN , Publish Date - Sep 02 , 2025 | 09:15 PM

అక్కినేని పెద్ద కోడలు శోభితా (Sobhita).. పెళ్లి తరువాత సినిమాలు చేయదు అనుకున్నారు. కానీ, కొద్దిగా గ్యాప్ ఇచ్చిన శోభిత ఎట్టకేలకు సెట్ లో అడుగుపెట్టింది.

Sobhita Akkineni

Sobhita Akkineni: అక్కినేని పెద్ద కోడలు శోభితా (Sobhita).. పెళ్లి తరువాత సినిమాలు చేయదు అనుకున్నారు. కానీ, కొద్దిగా గ్యాప్ ఇచ్చిన శోభిత ఎట్టకేలకు సెట్ లో అడుగుపెట్టింది. ఇక ఆ సెట్ లో అక్కినేని కోడలు గరిటె పట్టింది. తనలోని వంట స్కిల్స్ ను బయటపెట్టింది. సెట్ లో అందరికీ వంట వండుతూ శోభిత కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకుంది. సాంబార్, బెండకాయ ఫ్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. సెట్ లో ఒకపక్క షూటింగ్ చేస్తూనే.. ఇంకోపక్క బెండకాయలు తరుగుతూ కనిపించింది. ఇక అప్పుడప్పుడు తనలోని వంట స్కిల్స్ ను బయటపడుతున్నట్లు క్యాప్షన్ ఇచ్చి వెంటనే డిలీట్ చేసింది.


ఇక శోభిత వంట స్కిల్స్ చూసి ఆమె భర్త నాగ చైతన్య ఈ ఫోటోస్ కు తనదైన రీతిలో కామెంట్ పెట్టాడు. ఈ స్కిల్స్ ను తాను టేస్ట్ చేయడానికి ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి సంభాషణ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఒకప్పుడు శోభితను ట్రోల్ చేసినవారే.. ఇప్పుడు వదినా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా ఇష్టమైనవారికి వండిపెట్టడం కూడా ఒక ప్రేమనే అని చెప్పుకొస్తున్నారు. శోభిత తెనాలి అమ్మాయి కాబట్టి.. తెలుగు వంటలు బాగా చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య మంచి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు.


ఇక మరికొందరు మాత్రం ఇందులోకి సమంతను కూడా లాగుతున్నారు. కుకింగ్ విషయంలో సామ్ కన్నా శోభితా వెయ్యి రెట్లు బెటర్ అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే.. సామ్ కు వంట చేయడం రాదు. ఈ విషయం చై ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సామ్ ఎప్పుడు కిచెన్ లోకి కూడా వెళ్ళిన దాఖలాలు కూడా లేవని చెప్పాడు. ఇక సామ్ తో పెళ్లి తరువాత ఎప్పుడు చైనే వంట చేసి పెట్టినట్లు కొన్ని ఫోటోలు బయటకు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు వంట తెల్సిన భార్య వచ్చిందని, ఈ విధంగా చై లక్కీ ఫెలో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే శోభిత వంట చేస్తున్న ఆ సెట్.. ఏ సినిమా కోసం వేసింది.. ఆమె ఏ సినిమాలో నటిస్తుంది అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

Niharika Konidela: మెగా డాటర్ అందాల విందు.. అదిరింది

SISU2: యాక్ష‌న్ సినిమాల బాప్‌.. శిశు2 తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది

Updated Date - Sep 02 , 2025 | 09:19 PM