SISU2: యాక్ష‌న్ సినిమాల బాప్‌.. శిశు2 తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Sep 02 , 2025 | 08:20 PM

మూడేండ్ల క్రితం థియేట‌ర్ల‌కు వ‌చ్చి వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం శిశు (SISU)

SISU2

మూడేండ్ల క్రితం థియేట‌ర్ల‌కు వ‌చ్చి వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం శిశు (SISU). ఫిన్లాండ్‌ నుండి వ‌చ్చిన ఈ చిత్రం యాక్ష‌న్ సినిమాల చ‌రిత్ర‌లోనే పెను సంచ‌ల‌నం సృష్టించింది. అంతేగాక దీనిని మించిన యాక్ష‌న్ సినిమా లేదు.. ఇక రావ‌డం క‌ష్టం అనేంత‌గా గుర్తింపును ద‌క్కించుకుంది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా సిసు రోడ్ టు రివెంజ్ (Sisu Road to Revenge) మ‌రో సినిమా తెర‌కెక్కింది. గ‌త సినిమాకు కంటిన్యూగా ఈ చిత్రం ఉండ‌నుండ‌గా జోర్మా టోమిలా (Jorma Tommila) హీరోగా చేశాడు. అవ‌తార్ విల‌న్ స్టీఫెన్ లాంగ్ (Stephen Lang) ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. గ‌త దర్శకుడు జల్మారి హెలాండర్ (Jalmari Helander) ఈ మూవీకి సైతం డైరెక్ష‌న్ చేశాడు.

మొద‌టి దానిని మించి బ‌డ్జెట్‌తో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మించింది. మొద‌టి భాగాన్ని మించేలా క‌ళ్లు చెదిరే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో నెవ‌ర్ బిఫోర్ అనే రీతిలో ఉండ‌నుంది. గ‌త వార‌మే ఈ మూవీ ట్రూల‌ర్ రిలీజ్ చేయ‌గా సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. తాజాగా తెలుగు వ‌ర్ష‌న్ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేయ‌గా క్ష‌ణాల్లోనే ఊహించ‌ని విధంగా వ్యూస్ ద‌క్కించుకుంటోంది. 2025 నవంబర్ 21న భారతదేశ వ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

కథ విష‌యానికి వ‌స్తే.. మొదటి భాగంలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తన భూమిలో దొరికిన బంగారాన్ని నగరానికి తీసుకెళ్లే సమయంలో నాజీలతో ఎదుర్కొన్న యుద్ధమే ప్రధాన కాన్సెప్ట్‌. చివరికి ఆ బంగారాన్ని బ్యాంక్‌లో సేఫ్ చేసిన హీరోకి ఇప్పుడు కొత్త కష్టాలు మొదలవుతాయి. ఇంటికి తిరిగి వెళ్లే సరికి, యుద్ధ సమయంలో నాజీల చేతిలో తన కుటుంబం మొత్తం చంపబడ్డారని తెలుసుకుంటాడు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని తన ఇంటిని కూల్చి వచ్చిన వస్తువులను ట్రక్కులో వేసుకుని నగరానికి బయలుదేరతాడు. ఈ క్రమంలో త‌న కుటుంబాన్ని చంపించిన‌ నాజీ కమాండర్ ఎంట్రీ ఇచ్చి హీరోను బందీ చేయ‌డంతో క‌థ‌ మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ నేప‌థ్యంలో హీరో వారిని ఏ విధంగా ఢీ కొట్టాడు, ఏ స్థాయులో పోరాటం చేశాడ‌నేదే స్టోరి.

Updated Date - Sep 02 , 2025 | 08:48 PM