Niharika Konidela: మెగా డాటర్ అందాల విందు.. అదిరింది
ABN , Publish Date - Sep 02 , 2025 | 08:27 PM
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)ప్రస్తుతం నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. ఇప్పటికే కమిటీ కుర్రాళ్ళు లాంటి మంచి హిట్ ను అందుకుంది.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)ప్రస్తుతం నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. ఇప్పటికే కమిటీ కుర్రాళ్ళు లాంటి మంచి హిట్ ను అందుకుంది. ఈ మధ్యనే ఆమె తన బ్యానర్ లో మరో సినిమాను ప్రకటించింది. ఇక నిర్మాతగానే కాకుండా హీరోయిన్ గా కూడా నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో మద్రాస్ కారన్ సినిమా చేసినా అది ఆమెకు ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది.
ప్రస్తుతం నిహారిక చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో నిహారిక యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ తో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. తాజాగా మెగా డాటర్ తన దుబాయ్ డైరీస్ ను అభిమానులతో పంచుకుంది. బ్లూ కలర్ స్లీవ్ లెస్ డిజైనర్ డ్రెస్ లో నిహారిక ఎంతో అందంగా కనిపించింది. దుబాయ్ సిటీ లైట్స్ కు మ్యాచ్ అయ్యేలా డ్రెస్ అయ్యాను అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం మెగా డాటర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక నిహారిక వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం ఆమె సింగిల్ గానే జీవిస్తుంది. ఒక మనస్సు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ, అనుకోని విధంగా ప్రేక్షకులు అమ్మడిని ఆదరించలేకపోయారు. దీంతో మెగా ఫ్యామిలీ.. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిపించారు. మూడేళ్లు కలిసి ఉన్న ఈ జంట ఆ తరువాత విభేదాల వలన విడిపోయారు. త్వరలోనే నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందని నాగబాబు చెప్పుకొచ్చాడు. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుందో చూడాలి.
Anupama Parameswaran: రంగస్థలం ముందు నేను చేయాల్సింది.. కానీ, సుకుమార్ ..
Samantha: మరోసారి రాజ్ తో సమంత.. కావాలనే హింట్ ఇస్తుందా