Akkineni Sobhita: అక్కినేని కోడలి తొలి దీపావళీ.. కోటి దీపాల కాంతి అంతా ఆమె ముఖంలోనే
ABN , Publish Date - Oct 21 , 2025 | 04:58 PM
తాజాగా అక్కినేని పెద్ద కోడలు శోభితా (Sobhita Akkineni).. తన భర్త నాగ చైతన్య (Naga Chaitanya)తో దీపావళీ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Akkineni Sobhita: అక్కినేని ఇంట దీపావళీ సంబరాలు ఘనంగా జరిగాయి. దీపావళీ పండగను ఈసారి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), అమల.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంట జరుపుకున్న విషయం తెల్సిందే. ఈ విషయాన్నీ చిరునే అభిమానులతో పంచుకున్నాడు. నాగార్జున, వెంకటేష్ కుటుంబాలను తన ఇంటికి ఆహ్వానించి స్నేహితులతో పండగ జరుపుకున్నాడు. ఇక నాగ్ - అమల లేకపోవడంతో అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ తమ భార్యలతో కలిసి ఈ దీపాల పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.
తాజాగా అక్కినేని పెద్ద కోడలు శోభితా (Sobhita Akkineni).. తన భర్త నాగ చైతన్య (Naga Chaitanya)తో దీపావళీ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాదినే చై - శోభితాకు వివాహం జరిగింది. సమంతతో విడాకుల తరువాత శోభితాను ప్రేమించిన చై ఇరువర్గాల కుటుంబాలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి ముందు శోభితా ఎలా ఉన్నా కూడా పెళ్లి తరువాత అక్కినేని ఇంటి కోడలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ మంచి కోడలు, మంచి భార్య అని అనిపించుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే శోభితా తనకు సంబంధించిన ఫొటోస్ ను, చై కు సంబంధించిన ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. గతరాత్రి ఈ జంట దీపావళీ సంబరాలను బాగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి ముఖాల్లో ఆనందం కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కినేని కోడలి ముఖం కోటికాంతుల దీపాల వెలుగులా వెలిగిపోతుంది. చై సైతం తన భార్యను చూస్తూ ముగ్దుడై నిలబడిపోయాడు. ఇద్దరు సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ జంట ఫోటోలు చూసిన అభిమానులు చూడముచ్చటైన జంట అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Director Sujeeth: ఓజీకి రూ.6 కోట్ల సొంత డబ్బు ఖర్చు.. డైరెక్టర్ ఏమన్నాడంటే
Vash Level 2: ఓటీటీకి.. ఒళ్లు గగుర్పొడిచే హర్రర్ థ్రిల్లర్! మీ గుండెలు భద్రం