Director Sujeeth: ఓజీకి రూ.6 కోట్ల సొంత డబ్బు ఖర్చు.. డైరెక్టర్ ఏమన్నాడంటే
ABN , Publish Date - Oct 21 , 2025 | 04:14 PM
ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సాధారణం. సోషల్ మీడియా వచ్చాక ఈ రూమర్స్ కు హద్దే లేకుండా పోయింది. కొంతమంది సెలబ్రిటీలు ఈ రూమర్స్ ను పట్టించుకోరు
Director Sujeeth: ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సాధారణం. సోషల్ మీడియా వచ్చాక ఈ రూమర్స్ కు హద్దే లేకుండా పోయింది. కొంతమంది సెలబ్రిటీలు ఈ రూమర్స్ ను పట్టించుకోరు. ఇంకొందరు తమ మీద నెగిటివిటి రాకుండా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ ఉంటారు. తాజాగా డైరెక్టర్ సుజీత్ కూడా ఇదే పని చేశాడు. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఓజీ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు సుజీత్. ఈ సినిమా సెప్టెంబర్ 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
ఇక ఓజీ హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సుజీత్ చెప్పుకొచ్చాడు. అది కూడా నిర్మాత దానయ్యనే నిర్మిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. కానీ, ఓజీ 2 కు మాత్రం కొంచెం సమయం పడుతుందని తెలిపారు. మరో రెండు రోజుల్లో ఓజీ ఓటీటీ బాట పట్టనుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొట్టడం మొదలైంది.
నిర్మాత డీవీవీ దానయ్యకు, సుజీత్ కు మధ్య విభేదాలు తలెత్తాయని, ఓజీ సినిమా కోసం సుజీత్ సొంతంగా రూ. 6 కోట్లు ఖర్చు చేశాడని టాక్ నడిచింది. ఎక్కువ డబ్బులు పెట్టలేక దానయ్య చేతులు ఎత్తేస్తే.. సుజీత్ నే కొన్ని సీన్స్ ను సొంత డబ్బుతో నిర్మించాడని.. ఇప్పుడు ఆ లెక్కల విషయంలోనే వివాదాలు వచ్చాయని కొందరు అంటుండగా.. ప్రొడక్షన్ హౌస్ మార్చడం వలన వివాదం తలెత్తిందని చెప్పుకొస్తున్నారు.
సుజీత్.. ఓజీ సినిమా చేసేటప్పుడే నానితో ఒక సినిమాను ప్రకటించాడు. ఆ సినిమా కూడా డీవీవీలోనే చేస్తున్నట్లు తెలిపారు. అయితే సడెన్ గా నాని - సుజీత్ సినిమా డీవీవీ నుంచి తప్పుకొని నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. దీని వలనే వీరిద్దరికి చెడింది అనేది ఇంకో వాదన. ఏదిఏమైనా ఈ రూమర్స్ కు సుజీత్ క్లారిటీ ఇచ్చి చెక్ పెట్టాడు.
'చాలా చెబుతున్నారు, కానీ సినిమాను ప్రారంభం నుండి ముగింపు వరకు తీసుకెళ్లడానికి ఏమి అవసరమో చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. OG కోసం నా నిర్మాత మరియు నా చిత్ర బృందం చూపిన నమ్మకం, బలాన్ని మాటల్లో చెప్పలేను. అదే ఈ చిత్రానికి ఈ రోజు బలాన్ని ఇస్తుంది. ఇది ఎవరికీ సులభం కాదు, కానీ ప్రతి ప్రయత్నం నిబద్ధత నుండి వచ్చింది. దాన్ని గౌరవంగా ఉంచుకుందాం. పవన్ కళ్యాణ్ గారుమరియు OG పట్ల అభిమానులు చూపించిన ప్రేమ, పిచ్చి నాకు తెలుస్తుంది. దానయ్య గారు నాపై చూపించిన ప్రేమను, మద్దతుకు నేనెప్పుడూ ఋణపడి ఉంటాను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Thamma Movie Review: రశ్మిక.. థామా బాలీవుడ్ మూవీ రివ్యూ! సినిమా ఎలా ఉందంటే?
NTR: 70 ఏళ్ళ.. 'జయసింహ'! ఈ విషయాలు.. మీకు తెలుసా