Sobhan Babu: బ్లాంక్ చెక్ ఇచ్చినా మహేష్ కు తాతగా చేయను
ABN, Publish Date - Jul 26 , 2025 | 04:21 PM
ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు.. కొన్ని పాత్రలు ఎన్నేళ్ళైనా ప్రేక్షకుల మనసులను వదిలి పోవు.
Sobhan Babu: ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు.. కొన్ని పాత్రలు ఎన్నేళ్ళైనా ప్రేక్షకుల మనసులను వదిలి పోవు. అలాంటి సినిమాల్లో అతడు (Athadu) ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రిష జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జయభేరి పతాకంపై నటుడు మురళీమోహన్ (Murali Mohan) సమర్పణలో డి.కిశోర్ నిర్మించాడు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సోనూసూద్, నాజర్, బ్రహ్మానందం, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.
2005 ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయిన అతడు సినిమా అప్పట్లో నిర్మాతలకు నష్టాన్ని చూపించింది. థియేటర్ లో కాకుండా టీవీలో అతడు అఖండ విజయాన్ని అందుకుంది. ఇక ఈమధ్యకాలంలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. అందులో ఇప్పుడు అతడు కూడా చేరిపోయింది. దాదాపు 20 ఏళ్ల తరువాత అతడు.. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9 న రీ రిలీజ్ కానుంది. ఇక ఇందులో భాగంగా నిర్మాత మురళీ మోహన్ అతడుకు సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
అతడు సినిమా గురించి చెప్పాలంటే.. తాతమనవళ్ల కథ. ఈ సినిమాకు హీరో ఎంత ముఖ్యమో.. తాత పాత్ర కూడా అంతే ముఖ్యం. దానికోసమే ఆ పాత్రకు ఒక స్టార్ హీరోను తీసుకోవాలని చిత్ర బృందం భావించారట. ఐకియా మురళీ మోహన్.. సోగ్గాడు శోభన్ బాబు అయితే బావుంటుందని తలచి.. ఆయన ఇంటికి వెళ్లారట. శోభన్ బాబు.. ఇండస్ట్రీ వదిలేశాకా మళ్లీ ఇటువైపు చూడలేదు. తన వారసులను కూడా తీసుకురాలేదు. ఇక మురళీ మోహన్.. శోభన్ బాబు దగ్గరకు వెళ్లి.. ఇలా మహేష్ కు తాతగా ఒక పాత్ర ఉంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర. నువ్వు చేస్తే బావుంటుంది అని చెప్పి.. రెమ్యూనరేషన్ ఎంత కావాలంటే అంత తీసుకో అని బ్లాంక్ చెక్ ఇచ్చి వచ్చారట.
కానీ, శోభన్ బాబు మాత్రం ఆ బ్లాంక్ చెక్ ను తిరిగి మురళీ మోహన్ కు ఇచ్చే.. ఆ ఛాన్స్ ను సున్నితంగా తిరస్కరించారట. నన్ను హీరోగానే ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారట. దీంతో ఆ పాత్రకు ఎవరు అయితే బాగా సెట్ అవుతారు అని బాగా అలోచించి చివరకు నాజర్ ను ఓకే చేశారు. సత్యనారాయణ మూర్తి పాత్రలో.. పాతికేళ్లు క్రితం తప్పిపోయిన మనవడి కోసమే బ్రతికి ఉన్నట్లో ఆశతో ఎదురుచూసే ముసలివాడిగా నాజర్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. మరి అప్పుడు అంతగా హిట్ అవ్వని అతడు.. ఇప్పుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Murali Mohan - Athadu: అతడు రీ రిలీజ్.. ఈసారి పక్కా హిట్..
Mirai Song: సాంగ్ లోనే కాదు.. కుర్రాడిలో కూడా మంచి వైబ్ ఉందిగా