Sneha Ullal: కరెంట్ సినిమా హీరోయిన్.. బికినీలో బెంబేలెత్తిస్తుందిగా
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:09 PM
ఇప్పుడంటే ఎన్నో లవ్ బ్రేకప్ సాంగ్స్ వస్తున్నాయి. కానీ, అప్పట్లో లవ్ బ్రేకప్ అయిన అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, ఈ సాంగ్ వినకుండా నిద్రపోయేవారు కాదు.
Sneha Ullal: ఇప్పుడంటే ఎన్నో లవ్ బ్రేకప్ సాంగ్స్ వస్తున్నాయి. కానీ, అప్పట్లో లవ్ బ్రేకప్ అయిన అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, ఈ సాంగ్ వినకుండా నిద్రపోయేవారు కాదు. అదే అటు నువ్వే.. ఇటు నువ్వే.. మనసేటు చూస్తే అటు నువ్వే.. ఈ సాంగ్ అప్పట్లో ఎంత ఫేమసో అందరికీ తెల్సిందే. ఈ సాంగ్ అక్కినేని హీరో సుశాంత్ (Sushanth) నటించిన కరెంట్ (Current) సినిమా లోనిది. ఈ చిత్రం ద్వారానే స్నేహ ఉల్లాల్ (Sneha Ullal) మంచి గుర్తింపును తెచ్చుకుంది.
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమా తోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత కరెంట్ చిత్రం ఆమెకు స్టార్ హీరోయిన్ రేస్ లో నిలబెట్టింది. అందులో.. అమ్మడు చూడడానికి పిల్లి కళ్లతో ఐశ్వర్య రాయ్ లా కనిపించడంతో అందరూ ఆమెను జూనియర్ ఐశ్వర్య రాయ్ అని పిలవడం మొదలుపెట్టారు. సింహా, వరుడు, అలా మొదలైంది లాంటి సినిమాల్లో కనిపించిన స్నేహ.. ఆ తరువాత తెలుగుకు దూరమైంది. అడపదడపా సినిమాలు చేసినా అవేమీ అమ్మడికి గుర్తింపును అందించలేదు.
సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో స్నేహ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోస్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సింగిల్ పీస్ బికినీలో బెంబేలెత్తిస్తుంది. బ్లాక్ కలర్ వన్ పీస్ డ్రెస్ లో బెడ్ పై పడుకొని అందాలను ఆరబోస్తూ కనిపించింది. ముఖ్యంగా మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేస్తూ పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వీరల గా మారాయి. అయితే అమ్మడిని చూసిన తెలుగు అభిమానులు.. తెలుగులో రీఎంట్రీ ఎప్పుడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ చిన్నది తెలుగులో ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.
Jyathasya Maranam Druvam: జేడీ చక్రవర్తి.. జాతస్య మరణం దృవం! టీజర్ అదిరింది
Aditya Hasan: 90s డైరెక్టర్.. హ్యాట్రిక్ కొట్టాడు