Aditya Hasan: 90s డైరెక్టర్.. హ్యాట్రిక్ కొట్టాడు
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:17 PM
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు లిటిల్ హార్ట్స్ (Little Hearts). చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను నిర్మించింది ఆదిత్య హాసన్ (Aditya Hasan).
Aditya Hasan: ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు లిటిల్ హార్ట్స్ (Little Hearts). చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను నిర్మించింది ఆదిత్య హాసన్ (Aditya Hasan). ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే అనుకుంటున్నారా.. గతేడాది #90s అనే వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా తన సత్తా చాటిన అదే ఆదిత్యనే.. ఈ నిర్మాత ఆదిత్య. అవును డైరెక్టర్ గా ఎంత మంచి హిట్ ను అందుకున్నాడో.. నిర్మాతగా కూడా అంతే మంచి హిట్ అందుకున్నాడు.
అయితే #90s తరువాత.. ప్రేమలు తెలుగుకు డైలాగ్స్ రాసింది ఆదిత్యనే. ఈ విషయం చాలా తక్కువమందికి తెలుసు. #90s వెబ్ సిరీస్ లో కామెడీ డైలాగ్స్ నచ్చి.. ప్రేమలు తెలుగులో రిలీజ్ చేస్తున్న ఎస్ ఎస్ కార్తికేయ.. ఆదిత్య హాసన్ ను కలిసి మరీ కామెడీ డైలాగ్స్ రాయించుకున్నాడు. అలా డైరెక్టర్ గా మొదటి సినిమాతో సక్సెస్ అయిన ఈ కుర్రాడు.. రైటర్ గా రెండో సినిమా తో హిట్ అందుకున్నాడు.
ఇక ముచ్చటగా మూడో సినిమాకు నిర్మాతగా మారాడు. సోషల్ మీడియా స్టార్ మౌళి తనూజ్ ను హీరోగా నిలబెట్టి.. కథతోనే సినిమాను నడిపించే డైరెక్టర్ ను పట్టి.. ప్రేక్షకులను థియేటర్ బాట పట్టించి సక్సెస్ ఫుల్ నిర్మాతగా నిలిచాడు. అలా మూడు క్రాఫ్ట్స్ లో హిట్ కొట్టి.. తన కెరీర్ లో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం డైరెక్టర్ గా వెండితెరపై పెద్ద సినిమాతో రాబోతున్నాడు. #90s సిరీస్ లో ఉన్న చిన్నకొడుకు లవ్ స్టోరీని పెద్ద సినిమాగా చేయబోతున్నాడు. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమాతో డైరెక్టర్ గా వెండితెరపై ఆదిత్య హాసన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Cinema: టాలీవుడ్ స్టార్స్ తో పోటీ మేలని భావిస్తున్న రజనీకాంత్
Bakasura Restaurant OTT: సైలైంట్‌గా.. ఓటీటీకి బకాసుర రెస్టారెంట్