Jyathasya Maranam Druvam: జేడీ చక్రవర్తి.. జాతస్య మరణం దృవం! టీజర్ అదిరింది
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:11 PM
జేడీ చక్రవర్తి, నరేశ్ ఆగస్త్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం జాతస్య మరణం దృవం
జేడీ చక్రవర్తి (JD Chakravarthy), నరేశ్ ఆగస్త్య (Naresh Agastya) కీలక పాత్రల్లో నటించిన చిత్రం జాతస్య మరణం దృవం (Jyathasya Maranam Druvam). సీరత్ కపూర్ (Seerat Kapoor) కథానాయిక. పవన్ కల్యాణ్ భామ ప్రీతి జింగ్యానీ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోండగా, బాలీవుడ్ నటుడు రాజేశ్ శర్మ టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తున్నాడు. శ్రవణ్ జొన్నాడ (Shravan Jonnada) ఈ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా (Suraksh Entertainment Media) మల్కాపురం శివ కుమార్ (Malkapuram Shivakumar) నిర్మించాడు. గతంలో ఈ బ్యానర్ నుంచి సూర్య వర్సెస్ సూర్య, శౌర్యం, తిరగబడరా స్వామి వంటి చిత్రాలు వచ్చాయి.
అయితే.. తాజాగా సైకలాజికల్, థ్రిల్లర్ జానర్లో రూపొందించిన జాతస్య మరణం దృవం మూవీ టీజర్ శనివారం రాత్రి మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే మలయాళ థ్రిల్లర్‌లను మరిపించేలా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండి అదిరిపోయింది. ఏంటి ఇది మన తెలుగు వాళ్లు తీసిన సినిమానా లేక మలయాళీలు తీసిందా అనేలా డౌట్ వచ్చేలా ఉంది.
టీజర్‌ను చూస్తే మర్డర్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా కనిపిస్తోండగా జేడీ పోలీసాఫీసర్‌గా సీరియస్ రోల్ చేశారు. ఇక తమ్ముడు భామ ప్రీతి జింగానియా ఓ ఫోరెన్సిక్ ఎక్స్‌ఫర్ట్‌గా నటించగా నరేశ్ ప్రేమికురాలు మర్డర్ నేపథ్యంలో సినిమా సాగుతుండగా మరో హత్య వెలుగులోకి రావడం వంటి ట్విస్టులతో ఆకట్టుకునేలా ఉండగా నరేశ్ ది ఏ తరహా పాత్రలు అనేది రహస్యంగా ఉంచారు.
ఈ టీజర్ చూస్తుంటే.. సినిమాలో సమ్‌థింగ్ ఏదో ఉంది అనే ఫీల్ రావడంతో పాటు, జేడీకి మంచి కం బ్యాక్ అనేలా ఉంది. అంతేగాక తెలుగులో అరుదుగా వచ్చే థ్రిల్లర్ జానర్‌తో ఈ జాతస్య మరణం దృవం (Jyathasya Maranam Druvam) చిత్రం ప్రేక్షకులకు మంచి థ్రిల్ ఇవ్వనున్నట్లు అర్థమవుతోంది. ఇదిలాఉంటే పాన్ ఇండియాగా ఈ చిత్రం విడుదల కానుండగా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.