సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Sirish: ఎంగేజ్ మెంట్ ట్రోల్స్.. స్పందించిన శిరీష్

ABN, Publish Date - Nov 10 , 2025 | 08:45 PM

సోషల్ మీడియా వచ్చాకా ఎవరిని ట్రోల్ చేస్తున్నారో.. ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్ధం కాకుండా చేస్తున్నారు. నిజాలు ఏంటి.. ఆచారాలు ఏంటి అనేవి పట్టించుకోకుండా మీమ్స్ వేసి వారిని ట్రోల్ చేయడం ఆనందంగా భావిస్తున్నారు.

Allu Sirish

Allu Sirish: సోషల్ మీడియా వచ్చాకా ఎవరిని ట్రోల్ చేస్తున్నారో.. ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్ధం కాకుండా చేస్తున్నారు. నిజాలు ఏంటి.. ఆచారాలు ఏంటి అనేవి పట్టించుకోకుండా మీమ్స్ వేసి వారిని ట్రోల్ చేయడం ఆనందంగా భావిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు వాటిని లైట్ గా తీసుకుంటే.. ఇంకొందరు మాత్రం ఆ ట్రోల్స్ పై స్పందిస్తూ ట్రోలర్స్ కు వివరణ ఇస్తున్నారు. తాజాగా అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ (Allu Sirish).. తనపై వచ్చిన ట్రోల్స్ కు స్పందించాడు.

ఈ మధ్యనే అల్లు శిరీష్ నిశ్చితార్థం నయనికా రెడ్డితో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. మెగా కుటుంబం మొత్తమే వేడుకకు హాజరయ్యారు. ఇక వైట్ కలర్ డిజైనర్ షేర్వాణీలో శిరీష్ మెరవగా.. రెడ్ కలర్ సబ్యసాచి లెహంగాలో నయనికా కనిపించింది. వీరి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇక ఈ ఫోటోలలో శిరీష్ మెడలో చోకర్ ను వేసుకోవడం[ఐ ట్రోల్స్ ఎదురయ్యాయి. ఆడవారు చోకర్స్ వేసుకుంటారు. ఆడవారిలా శిరీష్ చోకర్ వేసుకున్నాడు ఏంటి.. ? నిశ్చితార్థంలో నెక్లెస్ వేసుకుంటేనే ఇలా అయిపోయారు.. పెళ్ళిలో వడ్డాణం కూడా పెట్టుకుంతె ఏమైపోతారో అంటూ మీమ్స్ వేశారు. తాజాగా ఆ మీమ్ ను షేర్ చేస్తూ సిరీస్ .. 'హ హహ బ్రో.. వడ్డాణం ఆడవారు ధరిస్తారు. కానీ, భారత మహారాజులు, మొఘల్స్ చోకర్స్ (నెక్లెస్) ను కూడా ధరిస్తారు' అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా చోకర్స్ ధరించిన రాజుల ఫోటోలను కూడా షేర్ చేశాడు. దీంతో నెటిజన్స్ సూపర్ చెప్పావ్ శిరీష్ బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Tollywood: కోలీవుడ్ చేసినట్లు టాలీవుడ్ చేయగలదా.. ఆ సత్తా ఉందా

Globe Trotter Song: సంచారి .. సంచారి.. సాహసమే తన దారి.. శృతిహాసన్ అదరగొట్టేసింది

Updated Date - Nov 10 , 2025 | 09:03 PM