Om Shanti Shanti Shantihi: సిన్నారి కూన.. సిన్నారి కూన లిరికల్‌సాంగ్
ABN, Publish Date - Dec 30 , 2025 | 05:24 PM
తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓం శాంతి శాంతి శాంతిహి నుంచి లిరికల్‌సాంగ్ రిలీజ్ అయింది.
దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓం శాంతి శాంతి శాంతి (Om Shanti Shanti Shantihi). ఇషా రెబ్బా (Eesha Rebba) కథానాయుకగా నటిస్తోండగా బ్రహ్మాజీ కీలక పాత్రలో చేస్తున్నాడు. సజీవ్ (AR Sajeev) దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై మంచి హైప్ తీసుకు వచ్చింది.
అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి సిన్నారి కూన (Sinnari Kona) అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. భరద్వాజ్ గాలి (Bharadwaj Gali) ఈ గీతానికి సాహిత్యం అందించగా జే క్రిష్ (Jay Krish) సంగీతంలో అనన్య భట్ (Ananya Bhat), ఎమ్జీ నరసింహా (MG Narasimha), జే క్రిష్ ఆలపించారు. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి అత్తగారికింటికి వెళుతున్న క్రమంలో వచ్చే గీతంగా అమ్మాయి కోణంలో ఈ పాట సాగింది.