Siddu Jonnalagadda: మగాడి విషయంలో సొసైటీ అన్యాయంగా ప్రవర్తిస్తుంది
ABN, Publish Date - Sep 26 , 2025 | 05:43 PM
కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టిల్లు స్క్వేర్ లాంటి హిట్ సినిమా తరువాత అలాంటి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.
Siddu Jonnalagadda: కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టిల్లు స్క్వేర్ లాంటి హిట్ సినిమా తరువాత అలాంటి హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. జాక్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న సిద్దు.. ప్రస్తుతం తెలుసు కదా (Telusu Kada) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్ గా మారి.. తెరకెక్కిస్తున్న మొదటి చిత్రం తెలుసు కదా. ఈ సినిమాలో సిద్దు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తెలుసు కదా అక్టోబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన సిద్దు.. తన ఇద్దరు హీరోయిన్లతో కలిసి పలు షోస్ కు అతిధులుగా వెళ్తున్నారు. అంతేకాకుండా సిద్దు సైతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు. తాజాగా సిద్దు ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు. ఇందులో పురుషుల విషయంలో సమాజం చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుందని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేశాడు. మగాడు ఏదైనా చేస్తేనే విలువ ఇస్తారని, లేకపోతే అసలు వాడు చచ్చినా పట్టించుకోరని చెప్పుకొచ్చాడు.
' ఈ ప్రపంచం, సొసైటీ.. మగాడి వైపు వింతగా చూపిస్తుందని అనిపిస్తుంది. మనం స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు మన పక్కన ఎవరు ఉండరు. అసలు ఏమి ఆలోచించరు. కనీసం నువ్వు పోయినా పట్టించుకోరు. ఆ మగాడు ఏదో ఒకటి చేయాలి. ఏదైనా సాధించాలి. అలా ఏదో ఒకటి చేసి నిలబడితే అప్పుడు మర్యాద ఇస్తారు. కానీ, ఆ మర్యాద కూడా చాలా జెలసీతో.. తప్పక ఒప్పుకోవడం అంటారు కదా అలా ఒప్పుకుంటారు. మగాడు అనేవాడు ఏదైనా చేయకపోతే వాడు బతకలేడు. అది అసాధ్యం. ప్రపంచం మగాళ్ల విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తుంది అని నాకనిపిస్తుంది' అని సిద్దు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Avatar: Fire and Ash Trailer: విజువల్ వండర్ కా బాప్.. అదిరిపోయిన అవతార్ కొత్త ట్రైలర్
Rishab Shetty :‘కాంతార’ క్రేజ్ నమ్మిన రిషబ్