Siddu Jonnalagadda: ఉమనైజర్ కాంట్రవర్సీ.. ఏదిపడితే అది మాట్లాడడం సరికాదు అన్న సిద్దు

ABN , Publish Date - Oct 14 , 2025 | 07:32 PM

ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్స్ పెద్ద కాంట్రవర్సీలకు వేదికలుగా మారుతున్నాయి. అడగకూడని ప్రశ్నలు అడిగి జర్నలిస్టులు.. అనకూడని మాటలు అని నటీనటులు విమర్శల పాలు అవుతున్నారు.

Siddu Jonnalagadda

Siddu Jonnalagadda: ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్స్ పెద్ద కాంట్రవర్సీలకు వేదికలుగా మారుతున్నాయి. అడగకూడని ప్రశ్నలు అడిగి జర్నలిస్టులు.. అనకూడని మాటలు అని నటీనటులు విమర్శల పాలు అవుతున్నారు. తాజాగా సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)ను ఒక మహిళా జర్నలిస్ట్ అడగకూడని ప్రశ్న అడిగింది. తెలుసు కదా (Telusu Kada) ట్రైలర్ లాంచ్ వేడుకలో రియల్ లైఫ్ లో మీరు ఉమనైజరా.. ? అనే ప్రశ్న అడిగింది. ఆ సమయంలో సిద్దు ఏమి స్పందించలేదు. సినిమా గురించి అడగండి. పర్సనల్ ఇంటర్వ్యూ కాదు కదా అని వదిలేశాడు.


ఉమనైజర్ ప్రశ్న మాత్రం సోషల్ మీడియాలో పెద్ద వివాదాన్ని సృష్టించింది. ఎలాంటి సినిమాలు తీస్తే బయట కూడా అలాగే ఉంటారా.. ? ఏంటా ప్రశ్న అని నెటిజన్స్ మండిపడ్డారు. తాజాగా ఈ వివాదంపై సిద్దు కూడా స్పందించాడు. చేతిలో మైక్ ఉందికదా అని ఏది పడితే అది అడగడం సరికాదని వాపోయాడు. ఆ సమయంలో తనకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు అని, అలాంటి ప్రశ్నలు అడగాలా వద్ద అనేది ఎవరికి వారు తెలుసుకోవాలని చెప్పాడు. సినిమాలో హీరో అండర్ కవర్ పోలీస్ గా నటిస్తే.. బయట కూడా గన్ పట్టుకొని ఎన్ కౌంటర్ చేస్తాడా.. ? అని ప్రశ్నించాడు.


' ఆమె అన్న పదం నాకు వినిపించింది. కానీ.. లైట్ తీసుకున్నా. అది తప్పు అనే విషయం వాళ్లు రియలైజ్ అవ్వాలి. ఆవిడ సరిగ్గా ఈవెంట్ కి 10 నిమిషాల ముందు ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేసింది. కట్ చేస్తే మైక్ పట్టుకుని అలా మాట్లాడింది' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సిద్దు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అక్టోబర్ 17 న తెలుసు కదా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్దు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించారు. మరి ఈ సినిమాతో సిద్దు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Wednesday Tv Movies: బుధ‌వారం, ఆక్టోబ‌ర్ 15.. ప్ర‌ధాన‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం అవ‌నున్న‌ సినిమాలివే

Netflix: లేట్ గా రియలైజ్ అయిన నెట్ ఫ్లిక్స్.

Updated Date - Oct 14 , 2025 | 07:53 PM