Netflix: లేట్ గా రియలైజ్ అయిన నెట్ ఫ్లిక్స్.

ABN , Publish Date - Oct 14 , 2025 | 06:56 PM

మన దేశంలో నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎప్పటి నుంచో పయనిస్తోంది. అయితే నెట్ ఫ్లిక్స్ ఫోకస్ అంతా హిందీ సినిమాలపైనే సాగింది.

Netflix

Netflix: మన దేశంలో నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎప్పటి నుంచో పయనిస్తోంది. అయితే నెట్ ఫ్లిక్స్ ఫోకస్ అంతా హిందీ సినిమాలపైనే సాగింది. అందువల్లే హిందీ ఒరిజినల్స్ ను నిర్మించింది. ఇప్పటి దాకా అనేక దక్షిణాది చిత్రాలను తమ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేసినా ఇప్పటి దాకా ఒరిజినల్ సౌత్ ఇండియన్ మూవీస్ ను రూపొందించలేదు నెట్ ఫ్లిక్స్. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ తొలిసారి రెండు తెలుగు చిత్రాలను, నాలుగు తమిళ సినిమాల ఒరిజినల్స్ రూపొందిస్తూ ఉండడం విశేషం.


సందీప్ కిషన్ హీరోగా సూపర్ సుబ్బు అనే ఒరిజినల్ తెలుగును నిర్మిస్తోంది నెట్ ఫ్లిక్స్. అలాగే ఆనంద్ దేవరకొండతో తక్షకుడు అనే తెలుగు మూవీని నెట్ ఫ్లిక్స్ అందిస్తోంది. వీటితో పాటు తమిళ ఒరిజినల్స్ గా మాధవన్ తో లెగసీ, అర్జున్ దాస్ తో లవ్, ప్రియాంక మోహన్ తో మేడ్ ఇన్ కొరియా, గోమతీ శంకర్ తో స్టీఫెన్ రూపొందిస్తోంది. అయితే హఠాత్తుగా సౌత్ లాంగ్వేజెస్ పై నెట్ ఫ్లిక్స్ ఫోకస్ పెట్టడంపై సినీజనం పలు రకాలుగా డిస్కస్ చేసుకుంటున్నారు.


గత సంవత్సరం దాకా హిందీ ఒరిజినల్స్ తోనే సాగిన నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు సడెన్ గా దక్షిణ భారత భాషలపై పోకస్ పెట్టడంపై చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన మన సౌత్ మూవీస్ గ్లోబల్ లోనే టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాయి. పైగా థియేటర్స్ లో కన్నా మిన్నగా సాగిన డాకూ మహరాజ్, దేవర, లక్కీ భాస్కర్ వంటి తెలుగు సినిమాల రేటింగ్స్ అబ్బుర పరిచాయి. అదే తీరున తమిళంలో మహరాజా, లియో, అమరన్ వంటి సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ ను షేక్ చేశాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ లాంగ్వేజెస్ పై కూడా ఫోకస్ పెడితే బాగుంటుందని నెట్ ఫ్లిక్స్ భావించినట్టు సమాచారం. లోకల్ కంటెంట్ కు ఉన్న విలువేంటో ఇన్నాళ్ళకు నెట్ ఫ్లిక్స్ తెలుసుకోవడం విడ్డూరమనీ కొందరు పరిశీలకులు అంటున్నారు.


ప్రస్తుతం థ్రిల్లర్స్ , కామెడీస్, రొమాన్స్, డ్రామాస్ ను జనం ఎంతగానో ఇష్టపడుతున్నారని నెట్ ఫ్లిక్స్ సర్వేలో తేలింది... ఈ నేపథ్యంలోనే ముందుగా తెలుగు, తమిళ భాషల్లో ఒరిజినల్స్ కు శ్రీకారం చుట్టామని నెట్ ఫ్లిక్స్ కంటెంట్ - వైస్ ప్రెసిడెంట్ మోనికా షేర్గిల్ చెబుతున్నారు... ఈ స్ట్రాటజీ సక్సెస్ అయితే, ఇతర భారతీయ భాషల్లోనూ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ రూపొందించనుందనీ తెలుస్తోంది... ఇన్నాళ్ళకు ప్రాంతీయ భాషలపై ఫోకస్ పెట్టిన నెట్ ఫ్లిక్స్ ఏ తీరున తన ఒరిజినల్స్ తో మెప్పిస్తుందో చూడాలి.

Mega158: చిరుతో రాజాసాబ్ బ్యూటీ రొమాన్స్.. మహా దారుణం ఇది

Kajol: యాక్టర్‌లకు ఆ అవకాశం ఉండదు అన్నానే తప్ప తక్కువ చేయలేదు..

Updated Date - Oct 14 , 2025 | 06:56 PM