సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shyamala Devi: ప్రభాస్ పెళ్లి.. ఆ శుభ సమయం రానుంది

ABN, Publish Date - Aug 11 , 2025 | 06:03 PM

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున సల్మాన్ ఖాన్(Salman Khan) అని చెప్పేస్తారు. అయితే సల్లూ భాయ్ ఇక జీవితంలో పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇవ్వడంతో పెళ్లి చేసుకొనే హీరోల లెక్కలో నుంచి ఆయనను ఎలిమినేట్ చేసేశారు.

Prabhas

Shyamala Devi: ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున సల్మాన్ ఖాన్(Salman Khan) అని చెప్పేస్తారు. అయితే సల్లూ భాయ్ ఇక జీవితంలో పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇవ్వడంతో పెళ్లి చేసుకొనే హీరోల లెక్కలో నుంచి ఆయనను ఎలిమినేట్ చేసేశారు. ఇక సల్లూభాయ్ తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే టక్కున ప్రభాస్ (Prabhas) అని చెప్పుకొచ్చేస్తారు. ఆ ఏడాది.. ఈ ఏడాది.. వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి అంటూ చెప్పుకోవడమే కానీ, ఆ పెళ్లి గురించి మాత్రం ఒక క్లారిటీ రావడం లేదు. కృష్ణంరాజు బ్రతికి ఉన్నంత కాలం.. కొడుకు పెళ్లి చేయాలనీ ఎన్ని కలలు కన్నారు. కానీ, ఆ కలలు నెరవేరకుండానే మరణించారు.


ఇక ఇప్పుడు ఆ బాధ్యతను కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తీసుకున్నారు. ప్రభాస్ పెద్దమ్మగా ఆమెకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు ఉంది. ప్రభాస్ పెళ్లి గురించి అంత క్లారిటీ ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది శ్యామలదేవి మాత్రమే. ఆమె ఎప్పుడు మీడియా ముందు కనిపించినా.. అందరు అడిగే ప్రశ్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..? అని.. ఆమెకూడా ఎప్పుడు ఆ ప్రషను దాటివేయకుండా ఏం జరుగుతుందో అదే చెప్తుంది. తాజాగా శ్యామల దేవి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిని సందర్శించింది. అక్కడ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.


' పూజలు చేయడానికి ప్రత్యేకేమైన కారణాలు లేవు. ఆయనకు భక్తితో నమస్కరిస్తే.. మనకేం కావాలో ఆయనే చేస్తాడు. మనస్ఫూర్తిగా ఆ తండ్రికి దండం పెట్టుకుంటున్నాను. ప్రభాస్ పెళ్లి గురించే అందరూ అడుగుతున్నారు. తప్పకుండా బాబుకు పెళ్లి చేయాలని చూస్తున్నాం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు. భగవంతుడు ఆజ్ఞ కోసం చూస్తున్నాం. ఆయన ఏరోజు అనుకుంటే ఆరోజు జరుగుతుంది. తప్పకుండా ఆ శుభ సమయం వస్తుంది. పైగా మాకు ఆడపిల్లలు ఉన్నారు. వారికి కూడా మంచి సంబంధాలు వస్తాయని అనుకుంటున్నాం. ప్రభాస్ కు ఇండస్ట్రీలోని అమ్మాయా.. ? లేక బంధువుల అమ్మాయా.. ? అనేది తెలియదు. కానీ, పెళ్లి మాత్రం జరుగుతుంది' అని చెప్పుకొచ్చింది.

Small Producers: సినీ కార్మికుల డిమాండ్స్ నిర్మాతలకు పెను భారం

Raviteja: ఎన్నాళ్లు ఈ రొట్ట కథలు.. రవితేజ

Updated Date - Aug 11 , 2025 | 06:03 PM