Kantara Chapter1: కాంతారా.. విలన్ 'కులశేఖర' వచ్చాడు
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:18 PM
కాంతారా చాఫ్టర్ 1 చిత్రం నుంచి బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఫస్ట్ లుక్ వచ్చేసింది.
మూడేండ్ల క్రితం వచ్చిన కాంతార వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత కన్నడ అగ్ర నటుడు రిషబ్ షెట్టి (Rishab Shetty) నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం కాంతారా చాఫ్టర్ 1 (Kantara chapter-1). దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో రెండు నెలల్లో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ధియేటర్లలో విడుదలకు ముస్తాబవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వారం పది రోజులకొకటి చొప్పున సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వారి లుక్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూ వస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమా నుంచి గత వారం ఈ చిత్రంలో కనకవతిగా చేస్తోన్న కథానాయిక రుక్మిణీ వసంత్ (Rukmini) లుక్, మూవీ బముకింగ్ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా ఈ రోజు (మంగళవారం) ప్రతినాయకుడు రాజా కుల శేఖర్ పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) పాత్రను రివీల్ చేశారు. ఈ చిత్రంతో గుల్షన్ కన్నడ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తుండడం విశేషం.