సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Phone Tapping: టాలీవుడ్‌లో షాకింగ్‌: ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఫోన్ టాపింగ్

ABN, Publish Date - Jun 23 , 2025 | 11:06 PM

ఫోన్‌ ట్యాపింగ్ లో తీగలు కదుపుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

barath

ఫోన్‌ ట్యాపింగ్ (Phone Tapping)లో తీగలు కదుపుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తెలంగాణ‌లో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ అనేది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాగిందని ప్రచారంలో ఉన్నా.. చాలా ఏళ్ల తరబడి ఈ వ్యవహారం నడుస్తున్నదని స్వయానా ఇంటెలిజెన్స్‌ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వెల్లడించారని సమాచారం. ఇదిలాఉంటే తాజాగా టాలీవుడ్ నుంచి తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ (Bharath Bhushan) ఫోన్‌ ట్యాపింగ్ విష‌యం తాజాగా చ‌ర్చ‌నీయాంశం అయింది.

గ‌డిచిన బీఆరెస్ ప్ర‌భుత్వ పాల‌న‌లో భరత్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్ అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు రాగా విచార‌ణ నిమిత్తం సోమ‌వారం ఉద‌యం సిట్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ నేప‌థ్యంలో 2023 ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు నుంచి ఆపై 6 నెల‌ల వ‌ర‌కు భరత్ ఫోన్ ట్యాప్ చేసి సంభాష‌ణ‌లు విన్న‌ట్లు తేలింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ అంశంపై పోలీసులు విస్తీతంగా విచార‌ణ నిర్వ‌హిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ఈ కేసు విష‌యంలో విచార‌ణ‌కు రావాల‌ని సిట్ నుంచి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డిలకు సైతం పిలుపు వెళ్లింది.

Updated Date - Jun 23 , 2025 | 11:06 PM