Bahubali The Epic: బాహుబలి: ది ఎపిక్‌ రన్‌ టైమ్‌ ఎంతంటే..

ABN , Publish Date - Oct 07 , 2025 | 06:01 PM

ఎస్‌ ఎస్‌ రాజామౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' విడుదలై పదేళ్లు పూర్తయింది. రెండు భాగాలుగా ప్రపంచ సినీ ప్రియులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్‌’ పేరుతో ఈ నెల 31న రిలీజ్‌ కానుంది.

Bahubali: The epic

తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’ (bahubali) పరాజయం తెలియని ఎస్‌ ఎస్‌ రాజామౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయింది. రెండు భాగాలుగా ప్రపంచ సినీ ప్రియులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్‌’ (Bahubali The epic) పేరుతో ఈ నెల 31న రిలీజ్‌ కానుంది. అయితే ఈ సినిమా రీరిలీజ్‌ అని రాజమౌళి (SS rajamouli) అనౌన్స్‌ చేసినప్పటి నుంచీ రెండు సినిమాలు కలిపి రన్‌ టైమ్‌ ఎంత ఉంటుందనేది చర్చగా మారింది. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) స్పందించారు.


‘బాహుబలి: ది ఎపిక్‌’ నిడివి 3 గంటల 40 నిమిషాలు. ఇందులో చిన్న మార్పు కూడా ఉండొచ్చు. ‘బాహుబలి 1’ ముగిశాక ఇంటర్వెల్‌.. తర్వాత ‘బాహుబలి 2’ ఉంటుంది’ అని అన్నారు. అలాగే మరో విషయంపై కూడా స్పందించారు. ‘బాహుబలి’ కోసం ముందుగా హృతిక్‌ రోషన్‌ను అనుకున్నామన్న వార్తల్లో నిజం లేదన్నారు. ‘బాహుబలి: ది ఎపిక్‌’ క్లైమాక్స్‌లో ‘బాహుబలి 3’ ప్రకటన ఉంటుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇందులో ఓ సర్‌ప్రైజ్‌ ఉంటుందని తెలిపారు.

ALSO READ: Kamal - Rajani: కమల్‌ - రజనీ మల్టీస్టారర్‌ దర్శకుడు క్లారిటీ..

Anikha Surendran: అజిత్ రీల్ కూతురు.. దేవుడా ఈ రేంజ్ లో రెచ్చిపోయిందేంటి

Venkatesh: శతదినోత్సవం చూసిన 'జయం మనదేరా'

Srikantha Addala: కిరణ్‌ అబ్బవరం మూవీ డైరెక్టర్ మారిపోయాడా...

Updated Date - Oct 07 , 2025 | 06:08 PM