Anikha Surendran: అజిత్ రీల్ కూతురు.. దేవుడా ఈ రేంజ్ లో రెచ్చిపోయిందేంటి
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:49 PM
మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది అనికా సురేంద్రన్(Anika Surendran).
Anikha Surendran: ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారు అని పెద్దలు అంటారు. ఇండస్ట్రీలో బాలనటీమణులను చూస్తుంటే నిజమే అనిపించకమానదు. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి చైల్డ్ ఆర్టిస్ట్ లుగా గుర్తింపు తెచ్చుకున్నవారే రెండేళ్లు తిరక్కముందే హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది అనికా సురేంద్రన్(Anikha Surendran). గుర్తింపులేని పాత్రలు చేస్తూ చేస్తూ బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ గా మారింది.
ఇక అజిత్ నటించిన విశ్వాసం సినిమాలో అజిత్ - నయన్ ల కూతురుగా నటించి మరింత పేరు తెచ్చుకుంది అనికా. ఆ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇక్కడ కూడా ఎన్నికకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తరువాత తెలుగులో నాగార్జున నటించిన ఘోస్ట్ లో కూడా అదరగొట్టింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూనే ఒక్కసారిగా హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో బుట్టబొమ్మ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది.
ఇక ఈ ఏడాది జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనికా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది వయస్సు పెరిగేకొద్దీ అందాల ఆరబోత చేస్తూ గ్లామర్ పాత్రలకు కూడా సిద్ధమని హింట్ ఇస్తుంది.
తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో అనికా అందాల ఆరబోత నెటిజన్స్ కు షాక్ ఇచ్చింది. ఎద అందాలను ఆరబోస్తూ టాప్ యాంగిల్ లో అమ్మడి పోజులు పిచ్చెక్కిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఓర్నీ.. ఈ పిల్ల ఈ రేంజ్ లో రెచ్చిపోతుందేంటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Venkatesh: శతదినోత్సవం చూసిన 'జయం మనదేరా'
Mass Jathara: నాగవంశీ కి 'బాహుబలి' గండం