Kanchana 4: ఇటు పూజా హెగ్డే, అటు నోరా ఫతేహీ నడుమ లారెన్స్...
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:45 PM
రాఘవేంద్ర లారెన్స్ మళ్ళీ 'కాంచన -4' సినిమా మీద ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహీ కీ-రోల్స్ చేయబోతున్నారని లారెన్స్ తెలిపాడు.
పాపులర్ డాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవేంద్ర లారెన్స్ తన 'కాంచన 4' సినిమా స్టార్ కాస్ట్ ను రివీల్ చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ సినిమాలో బ్యూటీఫుల్ యాక్ట్రస్ పూజా హెగ్డే తో పాటు సెక్సీ డాన్సర్ నోరా ఫతేహీ కూడా తన చిత్రంలో నటించబోతోందని తెలిపాడు. విశేషం ఏమంటే నోరా ఫతేహీకి ఇది తొలి తమిళ చిత్రం.
డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా మారాడు. ముఖ్యంగా హారర్ కామెడీ జానర్ లో అతను తీసిన 'ముని' (Muni) సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2007లో వచ్చిన ఆ సినిమాలో లారెన్స్ తో పాటు రాజ్ కిరణ్ (Raj Kiran) కీలక పాత్రను పోషించాడు. దీనికి కొనసాగింపుగా 'కాంచన' (Kanchana) చిత్రాన్ని 2011లో లారెన్స్ తీశాడు. ఇందులో శరత్ కుమార్ (Sharath Kumar) కీ-రోల్ ప్లే చేశాడు. ఈ సినిమాను హిందీలో 'లక్ష్మీ' పేరుతో అక్షయ్ కుమార్ రీమేక్ చేశాడు. ఇక 2015లో వచ్చిన 'కాంచన -2'లో తాప్సీ పన్ను (Taapsee Pannu), నిత్యామీనన్ (Nithya Menen) నటించారు. ఆ తర్వాత నాలుగేళ్ళకు వచ్చిన 'కాంచన -3'లో ఓవియా (Oviya), వేదిక (Vedhika) లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో తన 'కాంచన -4'లో లారెన్స్ ఇద్దరు అందాల ముద్దుగుమ్మలకు స్థానం కల్పించాడు. పూజా హెగ్డే (Pooja Hegde) ఈ మధ్య వచ్చిన రజనీకాంత్ 'కూలీ'లో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. అలానే సంక్రాంతి కానుకగా రాబోతున్న విజయ్ 'జన నాయగన్'లో కీ-రోల్ ప్లే చేస్తోంది. 'బాహుబలి'తో పాటు పలు తెలుగు చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ లో చేసిన నోరా ఫతేహీ (Nora Fatehi) కి 'కాంచన -4' తొలి తమిళ చిత్రం!
Also Read: The Girlfriend: సమంతను అనుకోలేదు... రశ్మికే ఫస్ట్ ఛాయిస్...
Also Read: Lokah Chapter 1: థియేటర్ లో సూపర్ హిట్ అన్నారు.. ఓటీటీకి వచ్చాకా ఏంటి ఇలా