B. Saroja Devi: చనిపోయి కూడా మరొకరి జీవితంలో వెలుగు నింపిన సరోజాదేవి
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:55 PM
ఈ కాలంలో బతికి ఉన్నప్పుడే పక్కవారికి సహాయం చేయాలంటే తటపటయిస్తూన్నారు. కానీ, సీనియర్ నటి బి. సరోజా దేవి (B. Saroja Devi) మాత్రం మరణించాకా కూడా మరొకరి జీవితంలో వెలుగునింపింది.
B. Saroja Devi: ఈ కాలంలో బతికి ఉన్నప్పుడే పక్కవారికి సహాయం చేయాలంటే తటపటయిస్తూన్నారు. కానీ, సీనియర్ నటి బి. సరోజా దేవి (B. Saroja Devi) మాత్రం మరణించాకా కూడా మరొకరి జీవితంలో వెలుగునింపింది. వయో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతూ అలనాటి మేటి నటి బి. సరోజా దేవి గతరోజు మరణించిన విషయం తెల్సిందే. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన సరోజా దేవి.. రీఎంట్రీలో కూడా కుర్ర హీరోల సినిమాల్లో కనిపించి కనువిందు చేసింది.
ఇక సరోజా దేవి మరణం ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఆమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే ఆమె మరణించినా కూడా వేరొకరి చూపులో నిత్యం బ్రతికే ఉంటుంది. అవయవ దానం ఎంత గొప్పదో అందరికీ తెల్సిందే. అలాంటి గొప్ప పనిని.. ఈ గొప్ప నటి ఐదేళ్ల క్రితమే చేసింది. ఆమె తన అందమైన కళ్లను దానం చేసింది. సరోజా దేవి అందమంతా ఆ కళ్లలోనే ఉంటుంది. కలువరేకులాంటి ఆ కళ్లు మరణించాకా మట్టిపాలు కాకుండా వేరొకరి జీవితంలో వెలుగు నింపితే అంతకు మించిన భాగ్యం ఏముంది అనుకున్న సరోజా దేవి ఐదేళ్ల క్రితం ఆమె తన రెండు కళ్ళను దానం చేసింది.
బి. సరోజా దేవి మరణించిన తరువాత ఆమె కుటుంబ సభ్యులు.. ఆమె కోరికను మన్నించి ఆ రెండు కళ్లను నారాయణ నేత్రాలయ హాస్పిటల్ కు డొనేట్ చేశారు. రెండు కార్నియాలు బాగా పనిచేస్తున్నాయని, త్వరలో అవసరమున్నవారికి సరోజా దేవి కళ్లను ట్రాన్స్ ప్లాంట్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలియడంతో సరోజా దేవి గొప్ప మనసును ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఆమె గురించి ప్రముఖులు చెప్పిన ప్రతి మాట వాస్తవమని, ఆమె చాలా గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు.
Jani Master Reentry: మళ్లీ ఫామ్ లోకి జానీ మాస్టర్.. ఆ సినిమాతో తెలుగులో రీఎంట్రీ
Yellamma: ఎల్లమ్మకు.. తమ్ముడి దెబ్బ