Yellamma: ఎల్లమ్మకు.. తమ్ముడి దెబ్బ
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:43 PM
ఇటీవల విడుదలైన నితిన్ ‘తమ్ముడు’చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర వైఫల్యం ప్రభావం ఇప్పుడు హీరో నితిన్ కెరీర్‌పై గట్టిగా పడింది.
ఇటీవల విడుదలైన నితిన్ (Nithiin) ‘తమ్ముడు’ (Thammudu )చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర వైఫల్యం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఫ్లాప్ ప్రభావం ఇప్పుడు హీరో నితిన్ కెరీర్‌పై గట్టిగా పడింది. దాంతో ఆయన తదుపరి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో, బలగం ఫేమ్ వేణు (Venu) యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘ఎల్లమ్మ’ (Yellamma) ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అసలు సినిమా ఉంటుందా అనే కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తన ఇరవై ఏండ్ల కెరీర్‌లో సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నితిన్ ఇప్పటివరకు 30కి పైగా సినిమాలు చేయగా అందులో 75 శాతం ఫెయిల్యూర్స్ ఉన్నాయి. పది సినిమాలు వస్తే అందులో ఒకటి రెండు మాత్రమే విజయం సాధివచడం విశేషం. ఫెయిల్యూర్ వ,చ్చిన ప్రతీ సారి తర్వాత వచ్చే సినిమా బ్లాక్ బస్టర్ వస్తుందనేంతగా హైప్ వచ్చి అఖరికి వచ్చే సరికి చతికిల పడిపోవడం నితిన్‌కు కామన్ అయిపోయింది.
ఇటీవల రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల రిలీజ్‌కు ముందు వచ్చిన క్రేజ్ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక.. దిల్ రాజుతో తమ్ముడు సినిమా జరుగుతుండగానే నితిన్ అదే బ్యానర్‌లో బలగం వంటి క్లాసిక్ సినిమాను అందించిన వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ సినిమాను ప్రకటించారు. హీరోయిన్‌గా సాయిపల్లవి, కీర్తి సురేష్‌లను సంప్రదించినా వారు ప్రాజెక్ట్‌కి నో చెప్పినట్లు తెలుస్తోండగా.. ఇప్పుడు ‘తమ్ముడు’ ఫలితం చూసి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అన్నది సందేహంగా మారింది. అయితే.. ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమా ఫలితం ఎల్లమ్మ సినిమాపై గట్టిగానే పడినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన తమ్ముడు సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.22 కోట్ల బిజినెస్ జరగ్గా, బ్రేక్ ఈవెన్‌కి రూ.22.5 కోట్లు రాబట్టాలి. కానీ థియేట్రికల్ రన్ ముగిసే సరికి రూ.5 కోట్లు కూడా రాబట్టలేదు. కేవలం రూ.3.5 కోట్లు మాత్రమే రాబట్టి ఘోర పరాభవం ఎదురైంది. ఓటీటీ రైట్స్‌తో ఇందులో సగం తిరిగి వచ్చినా మరో పాతిక, ముప్పై కోట్ల వరకైతే నష్టాలు భరించక తప్పని పరిస్థితి. తమ్ముడు సినిమా విషయంలో ఒక్కసారిగా వచ్చిన ఈ ఫలితంతో నితిన్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఎల్లమ్మ సినిమాను ముందుగకు తీసుకెళ్లాలా లేదా అనే డౌటానుమానాల్లో దిల్ రాజు అండ్ టీం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్’తో భారీ నష్టాలు చూసిన దిల్ రాజు, ‘తమ్ముడు’ ఫ్లాప్‌తో మరింత జాగ్రత్తగా మారినట్లు తెలుస్తోంది. ‘ఎల్లమ్మ’ కోసం కూడా భారీ బడ్జెట్ అవసరం. దీంతో దిల్ రాజు ఇప్పుడు ఆలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒకవేళ సినిమా సెట్స్ మీదికి వెళితే, హీరో నితిన్, డైరెక్టర్ వేణుకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా లాభాల్లో వాటాలు మాత్రమే ఇస్తానని దిల్ రాజు షరతు పెట్టారనే ఇంట్రెస్టింగ్ వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే తమ్ముడు సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్న నితిన్ ఇప్పుడు తన కెరీర్ కోసమైనా ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటాడా లేక తన సొంత బ్యానర్లో ఏమైనా సినిమాలు చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే.. నితిన్ ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈ డీల్‌కి ఒప్పుకోవడం తప్ప మరో దారి లేదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయే తప్పా దిల్ రాజు నుంచి గానీ నితిన్, వేణు టీం ల నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌పై స్పష్టత కోసం మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.