K RAMP: కిరణ్ అబ్బవరం కొత్త లవ్ సాంగ్ తో వచ్చేస్తున్నాడు
ABN , Publish Date - Sep 06 , 2025 | 07:40 PM
క సినిమాతో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) జోష్ పెంచాడు. ఈ సినిమా తరువాత మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ప్రామిస్ కూడా చేశాడు.
K-RAMP: క సినిమాతో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) జోష్ పెంచాడు. ఈ సినిమా తరువాత మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ప్రామిస్ కూడా చేశాడు. క తరువాత వచ్చిన దిల్ రుబా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. అయిత ఈసారి మాత్రం కచ్చితంగా మరో హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా కిరణ్ నటిస్తున్న తాజా చిత్రం కె ర్యాంప్ (K-RAMP). జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంష్ సెల్యులాయిడ్ బ్యానర్ పై రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు.
కె ర్యాంప్ సినిమాలో కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ చిత్రం దీపావళీ కానుకగా అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఒక్కో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు.
తాజాగా కె ర్యాంప్ నుంచి రెండో సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేస్తూ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. కలలే కలలే అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇదొక లవ్ సాంగ్ లా అనిపిస్తుంది. కలువలు నిండిన కొలను మధ్యలో ఒక బోట్ లో కిరణ్, యుక్తి కూర్చొని మాట్లాడుకుంటారు. కిరణ్.. ప్రపోజ్ చేయనా అని అడగ్గా.. సాంగ్ పాడమని అడుగుతుంది. వెంటనే కిరణ్.. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ ను, లిరిసిస్ట్ భాస్కరభట్లను తలుచుకొని కలలే కలలే సాంగ్ రెండు లైన్స్ పాడతాడు.
యుక్తి.. ఇంకా పాడు అనగానే సెప్టెంబర్ 9 న ఫుల్ సాంగ్ వస్తుంది చూడండి అంటూ కిరణ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సాంగ్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ కొత్త లవ్ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యేలా ఉంది. మరి ఈ సినిమాతో కిరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Mohanlal : హ్యాట్రిక్ చేరువలో మోహన్ లాల్
SSMB29: ఇదెక్కడి ట్విస్ట్ రా మావా.. శ్రీరాముడిగా మహేష్