Mohanlal : హ్యాట్రిక్ చేరువలో మోహన్ లాల్
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:55 PM
మాలీవుడ్ సూపర్ స్టార్ కు షాక్ తగిలేలా ఉంది. హ్యాట్రిక్ హిట్లతో ఇండస్ట్రీలో కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడనుకుంటున్న వేళ.. సడెన్ బ్రేక్ పడేలా కనిపిస్తోంది. దీంతో ఎన్నో రోజులుగా అభిమానులు కలలు కంటున్న ఆ రికార్డు క్రియేట్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు.
మళయాళ సినిమాలు చాలా బాగుంటున్నాయి కానీ కలెక్షన్ల విషయంలో కాస్త వెనకబడుతుంటాయి. కానీ మాలీవుడ్ పరిశ్రమలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తుంటారు సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) . ఆయన నటించిన ‘L2: ఎంపురాన్ (L2: Empuraan)’ , ‘తుడరుం’ (Thudarum)చిత్రాలు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం రేపగా.. ఇప్పుడు లెటెస్ట్ మూవీ ‘హృదయపూర్వం’ (Hridayapoorvam) కూడా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే దిశగా దూసుకెళ్తోంది. వరసగా మూడు మూవీలు వంద కోట్ల క్లబ్‌లోచేరిన ఘనతను సొంతం చేసుకుంటారని అందరూ ఊహిస్తుండగా.. సడెన్ షాక్ తగిలేలా కనిపిస్తోంది.
‘హృదయపూర్వం’ ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్కును అందుకుంది. రూ. 100 కోట్లు కూడా క్రాస్ చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ.. ఉన్నట్టుండి ఈ మూవీకి గట్టి పోటీ ఎదురవుతోంది. కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన ‘కొత్తలోక’ (Kotha Loka ) టఫ్ ఫైట్ ఇస్తోంది. ఇప్పటకే ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూకుడు కనబరుస్తోంది. బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. అనూహ్యమైన సానుకూల స్పందనతో మోహన్‌లాల్ ‘హృదయపూర్వం’ రూ.100 కోట్ల మైలురాయిని అందుకోవడం కొంత కష్టసాధ్యంగా మారిందని అనుకుంటున్నారు.
మళయాళ సినిమా రంగంలో ఇప్పటివరకు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు చాలా తక్కువ. అయితే, ‘లోక: చాప్టర్ 1’ ఈ క్లబ్ లో చేరింది. మరోవైపు, ‘హృదయపూర్వం’ తన పూర్తి రన్‌లో రూ.100 కోట్ల మార్కును అందుకుంటే, మోహన్‌లాల్ ఖాతాలో హ్యాట్రిక్ ఖాయమని చెప్పవచ్చు. ఈ రెండు చిత్రాల మధ్య జరుగుతున్న ఈ ఆసక్తికరమైన పోటీ మలయాళ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
Read Also: SSMB29: ఇదెక్కడి ట్విస్ట్ రా మావా.. శ్రీరాముడిగా మహేష్
Read Also: SIIMA 2025: పవన్ మాటలకు.. గాల్లో తేలిపోయినట్లైంది..