K Ramp: కలలే కలలే సాంగ్.. భలే కలర్ ఫుల్ గా ఉందే

ABN , Publish Date - Sep 09 , 2025 | 07:34 PM

హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), యుక్తి తరేజా (Yukti Thareja) జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కె ర్యాంప్ (K Ramp).

K Ramp

K Ramp: హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), యుక్తి తరేజా (Yukti Thareja) జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కె ర్యాంప్ (K Ramp). ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంష్ సెల్యులాయిడ్ బ్యానర్స్ పై రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. కలలే కలలే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఎంతో కలర్ ఫుల్ గా సాగింది.


ముఖ్యంగా కిరణ్ అబ్బవరం హిట్ సినిమాల్లో ఒకటైన ఎస్ఆర్ కళ్యాణమండపంలోని మెలోడీ సాంగ్స్ గుర్తొచ్చాయి అని చెప్పొచ్చు. అందులో హీరోయిన్ వెంటపడినట్టే.. ఈ సాంగ్ లో కూడా కిరణ్.. హీరోయిన్ వెంట పడుతూ.. ఆమెపై తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు లిరిక్స్ ఉన్నాయి. ఇక ఈ సాంగ్ కు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. ఇక కపిల్ కపిలియన్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు.


ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే కిరణ్ - యుక్తి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా లొకేషన్స్.. చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. కొలను లోపల తామరపువ్వులు, వాటి మధ్యలో పడవ.. చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. మెలోడీ.. అందులోనూ లవ్ సాంగ్ కావడంతో.. ప్రేమికులందరూ ఈ సాంగ్ ను చార్ట్ బస్టర్ గా చేస్తారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. క లాంటి హిట్ తరువాత కిరణ్ మరో విజయాన్ని అందుకోలేదు. మరి ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Salman Khan: ఇంటర్నేషనల్‌ స్పై మ్యూజియంలో..  ‘ఏక్‌ థా టైగర్‌’

TG Vishwa Prasad: పెద్ద కాన్వాస్‌ ఉన్న సినిమా.. నిర్మాతగా పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయ్యా..  

Updated Date - Sep 09 , 2025 | 07:34 PM